PM Kisan 2025: దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాతల పంటల పెట్టుబడుల కోసం అందజేసే పీఎం కిసాన్ పథకం 19వ విడత విడుదల తేదీని కేంద్రం ప్రకటించింది. దీంతో పీఎం కిసాన్ పథకం కింద ఉన్న రైతులందరికీ రూ.2,000 చొప్పున వారి ఖాతాల్లో పడనున్నాయి. ఇప్పటికే 18 విడతల్లో రూ.2000 చొప్పున ప్రణాళికాబద్ధంగా నగదుసాయాన్ని అందిస్తూ వస్తున్నది.
PM Kisan 2025: బిహార్ రాష్ట్రంలోని భాగల్పూరులో పీఎం కిసాన్ 19వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేస్తారు. దీంతో ప్రతి రైతు ఖాతాలో రూ.2 వేల నగదు జమ కానున్నాయి. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ పథకం కింద ఉన్న 9.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనున్నదని అధికారులు తెలిపారు.
PM Kisan 2025: ఈ పీఎం కిసాన్ పథకం నిధులు తమ ఖాతాల్లో జమ కావాలంటే రైతులు తప్పకుండా ఈ-కేవైసీ పూర్తి ఏసి, ఎన్‌పీసీఐ, ఆధార్‌తో అనుసంధానం అయి ఉండి, బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. ఈ మేరకు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో కానీ, యాప్‌లో రైతులు తమ స్టేటస్ కానీ, రైతుల పేరు ఉన్నదో, లేదో తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.