Pawan Kalyan

Pawan Kalyan: తెలంగాణ సాయుధ పోరాటానికి చరిత్రలో ప్రత్యేక స్థానం..

Pawan Kalyan: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ చరిత్రలో సాయుధ రైతాంగ పోరాటం ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని పేర్కొన్నారు.

తెలంగాణ విమోచన జ్ఞాపకం
పవన్‌ కళ్యాణ్‌ గుర్తుచేస్తూ, “భారతదేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సాధించినప్పటికీ, నిజాం నిరంకుశ పాలనలో ఉన్న తెలంగాణకు ఆ స్వేచ్ఛ ఫలాలు చేరేందుకు మరో 13 నెలలు సమయమైంది” అన్నారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్‌ నేతృత్వంలో సాగిన పోలీస్ యాక్షన్‌ వల్లే తెలంగాణకు విముక్తి లభించిందని ఆయన స్పష్టం చేశారు.

రజాకార్ల అకృత్యాలు
నిజాం పాలనలో రజాకార్లు ప్రజలపై అణచివేతకు తెగబడిన తీరు, వారి నాయకుడు కాసీమ్ రజ్వీ ఢిల్లీ ఎర్రకోటపై అసఫ్‌జాహీ పతాకం ఎగరేస్తానని విర్రవీగిన పరిస్థితులను పవన్‌ గుర్తుచేశారు. అలాంటి పరిస్థితుల్లో రైతులు, సామాన్య ప్రజలు సాయుధ పోరాటం ద్వారా ప్రతిఘటించారని, వారి ధైర్యసాహసాలు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయాయని పేర్కొన్నారు.

Also Read: Rajni-Kamal: యంగ్ డైరెక్టర్ చేతికి వెళ్లిన.. రజనీకాంత్ – కమల్ హాసన్ సినిమా

ఈ తరానికి సందేశం
ఆ పోరాటం వెనుక ఉన్న స్ఫూర్తిని నేటి తరానికి చేరవేయాల్సిన అవసరం ఉందని పవన్‌ అన్నారు. తెలంగాణ ప్రజలు అద్భుతమైన పోరాట చరిత్ర కలిగి ఉన్నారని, అదే ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిలోనూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *