Pawan Kalyan:

Pawan Kalyan on Pushpa Issue: హీరోను ఒంటరి చేశారు.. పుష్ప ఘటనపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan on Pushpa Issue:సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ మీడియా చిట్‌చాట్‌లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న స్పందించ‌నేలేదు. సొంత బంధువైనా ఇటీవ‌లి ప‌రిణామాలు అల్లు అర్జున్‌కు మెగా ఫ్యామిలీకి దూరం పెరిగింది. దీన్ని మ‌రింత సెగ పుట్టేలా అల్లు అర్జున్ ఎన్నిక‌లకు ముందు నంధ్యాల వైసీపీ అభ్యర్థికి మ‌ద్ద‌తు తెలుపుతూ స్వ‌యంగా ఆయ‌న ఇంటికే వెళ్లారు. దీంతో మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్‌పై ఫైర్ అయ్యారు. అప్ప‌టి నుంచి మెగా ఫ్యామిలీ వ‌ర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్న‌ట్టుగా అభిమానులు ర‌గిలిపోయారు.

Pawan Kalyan on Pushpa Issue:సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న అనంత‌రం అల్లు అర్జున్‌కు స‌రైన స‌పోర్ట్ లేకుండా పోయింది. మెగా ఫ్యామిలీని ఎప్పుడైతే దూరం చేసుకున్నాడో అప్ప‌టి నుంచి వారి మ‌ద్ద‌తు కూడా లేకుండాపోయింది. ఘ‌ట‌న అనంత‌రం క‌నీసం అటు చిరంజీవి, ఇటు ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌నీసం ప‌రామ‌ర్శించ‌నే లేదు. దీంతో వీరి వైరం స‌మ‌సిపోలేద‌ని అంద‌రూ భావించారు. ఈ ఘ‌ట‌న‌పై చిరు, ప‌వ‌న్ క‌నీసం బ‌హిరంగ ప్ర‌క‌ట‌న కూడా చేయలేదు.

Pawan Kalyan on Pushpa Issue:సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై తొలిసారి తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌న‌ల వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారాయి. సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌నలో అభిమాని చ‌నిపోతే వెంట‌నే వెళ్లి ప‌రామ‌ర్శించాల్సింది అని ప‌వ‌న్ పేర్కొన్నారు. ఒక‌వేళ అల్లు అర్జున్ వెళ్ల‌కున్నా ఆ సినిమా టీమ్ అయినా వెళ్తే బాగుండేది అని అభిప్రాయ‌ప‌డ్డారు. గోటితో పోయేదాన్ని గొడ్డ‌లిదాకా తెచ్చుకున్నార‌ని పేర్కొన్నారు.

Pawan Kalyan on Pushpa Issue:తొక్కిస‌లాట ఘ‌ట‌న అనంత‌రం మాన‌వ‌తా దృక్ప‌థం లోపించిన‌ట్ట‌యింద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సినీ ప‌రిశ్ర‌మ‌ను ప్రోత్స‌హించార‌ని, జగన్ ప్రభుత్వంలా రేవంత్ రెడ్డి వ్యవహరించలేదనీ పవన్ వ్యాఖ్యానించారు . పుష్ప 2 సినిమాకు టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోల అనుమ‌తి సినీ ప‌రిశ్ర‌మ‌కు ఆయ‌న ఇచ్చిన ప్రోత్సాహ‌మే కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. అల్లు అర్జున్ సీఎం పేరు చెప్ప‌లేద‌ని, అందుకే క‌క్ష‌సాధింపు అన్న మాట‌ల‌ను ప‌వ‌న్ కొట్టిపారేశారు.

పేరు చెప్ప‌లేద‌నే స్థాయిని దాటిన బ‌ల‌మైన నేత రేవంత్‌రెడ్డి అని ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. బన్నీ స్థానంలో రేవంత్ ఉన్నా కేసుల‌పాలు కాక త‌ప్ప‌ద‌ని, చ‌ట్టం ఎవ‌రికీ చుట్టం కాద‌ని ప‌వ‌న్ చెప్పారు. ఈ వివాదంలో హీరోను ఒంటరి చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. అల్లు అర్జున్ విష‌యంలో ముందూ వెనుక ఏం జ‌రిగిందో త‌న‌కు తెలియ‌ద‌ని, అభిమానుల‌కు అభివాదం చేయాల‌ని ప్ర‌తి హీరోకూ ఉంటుంద‌ని చెప్పారు.

చాలాకాలం తరువాత పవన్ స్పందన ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. ఇప్పటికే మెగా ఫ్యాన్స్ . . అల్లు ఫ్యాన్స్ గా విడిపోయి సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోసుకుంటున్న ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ స్పందనతో తమ మధ్య వైరానికి చెక్ పెడతారా లేదా అనేది వేచిచూడాలి .

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *