Horoscope: ఈరోజు శనివారం, జూలై 5, 2025 నాడు పన్నెండు రాశుల వారికి దినఫలాలు ఎలా ఉన్నాయో, ఏ రాశి వారికి ఎలాంటి శుభ, అశుభ ఫలితాలు ఎదురుకానున్నాయో తెలుసుకుందాం. మీనం నుంచి మేషం వరకు ఉన్న అన్ని రాశుల వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1):
మేష రాశి వారికి ఈరోజు వృత్తి జీవితంలో డిమాండ్ పెరిగి, ఉద్యోగంలో అధికార యోగం కలిసి వస్తుంది. వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. విద్యార్థులు మంచి విజయాలు సాధిస్తారు. దేవాలయ సందర్శన మీకు మేలు చేస్తుంది.
వృషభ రాశి (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2):
వృషభ రాశి వారికి ఈరోజు వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. బంధువులతో సఖ్యతగా ఉండాలి. ఆర్థికంగా అనుకూల పరిస్థితులుంటాయి. కొద్దిగా అనారోగ్య సూచనలున్నాయి. శ్రీ ఆంజనేయుని ఆరాధనతో శ్రేయస్సు పొందుతారు.
మిథున రాశి (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3):
మిథున రాశి వారికి ఈరోజు బుద్ధిబలంతో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆస్తి సంబంధిత విషయాల్లో మంచి అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితి బాగా చక్కబడుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. మానసిక శాంతి తగ్గకుండా చూసుకోవాలి. నవగ్రహ ఆరాధన శుభప్రదం.
కర్కాటక రాశి (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష):
కర్కాటక రాశి వారికి ఈరోజు వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అధికార యోగం పట్టే అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఆదాయ వృద్ధికి సమయం అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం ఉత్తమం.
సింహ రాశి (మఖ, పుబ్బ, ఉత్తర 1):
సింహ రాశి వారికి ఈరోజు ఇంటా బయటా పనిభారం, ఒత్తిడి పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దుర్గాదేవిని పూజించండి.
కన్య రాశి (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2):
కన్య రాశి వారికి ఈరోజు సమస్యలను అధిగమించేందుకు ధైర్యంతో ముందడుగు వేస్తారు. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. శివారాధన శాంతిని ఇస్తుంది.
తుల రాశి (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3):
తుల రాశి వారికి ఈరోజు చిన్న చిక్కులు ఎదురైనా త్వరగా పరిష్కారమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన దాని కంటే ఎక్కువగా సఫలం అవుతాయి. అశ్రద్ధతో చేసిన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కనకధారా స్తోత్రం చదవడం శుభప్రదం.
వృశ్చిక రాశి (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట):
వృశ్చిక రాశి వారికి ఈరోజు గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నప్పటికీ శ్రద్ధతో ముందుకు సాగాలి. ఆరోగ్యం విషయమై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వివాదాలకు దూరంగా ఉండండి. ఎవరికీ హామీలు ఇవ్వకుండా ఉండటం మంచిది. శ్రీ వేంకటేశ్వరస్వామిని పూజించడం శ్రేయస్కరం.
Also Read: Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ప్రతీ భార్యకు ఉండాల్సిన మంచి లక్షణాలు ఇవే !
ధనుస్సు రాశి (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1):
ధనుస్సు రాశి వారికి ఈరోజు దైవబలం తోడుగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆర్థికంగా లాభదాయక సమయం. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఇష్టదైవ ఆరాధనతో శుభ ఫలితాలు పొందుతారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2):
మకర రాశి వారికి ఈరోజు ప్రయత్నాలకు అనుకూల ఫలితాలు పొందుతారు. కీలక నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. ఖర్చులను నియంత్రించాలి. ఆశించిన దాని కంటే ఎక్కువగా ఆదాయ వృద్ధి ఉంటుంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన శ్రేయస్కరం.
కుంభ రాశి (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3):
కుంభ రాశి వారికి ఈరోజు ముందుచూపుతో పనులు చేయడం వల్ల శ్రమ తగ్గుతుంది. శుభకాలాన్ని ఆనందంగా గడుపుతారు. ఉద్యోగంలో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ, ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.
మీన రాశి (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి):
మీన రాశి వారికి ఈరోజు ఉత్సాహంగా పనులను పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆర్థికంగా అనుకూల సమయం. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు కలుగుతాయి. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మీకు శ్రేయస్సును తీసుకొస్తుంది.