Telangana Police: సీఎంగా రేవంత్‌రెడ్డి పాలనలో తనదైన ముద్ర వేసేందుకు పాటుపడుతున్నారు. ఇప్పటికే వివిధ మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారు. తాజాగా తెలంగాణ పోలీస్ లోగోలోనూ ప్రభుత్వం స్వల్ప మార్పు చేసింది. ఈ మేరకు నూతన లోగోను పోలీస్ శాఖ విడుదల చేసింది. ఈ మేరకు పోలీస్ శాఖ తన ట్విట్టర్ ఖాతాలో నూతన లోగోను పోస్టు చేసింది.
Telangana Police: వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో తమ శాఖలకు ముందు ఉన్న టీఎస్ (TS) పేరును తొలగించి, టీజీగా మార్పులు చేశారు. దీంతో తెలంగాణ పోలీస్ కూడా తమ శాఖకు సంబంధించిన అధికారిక చిహ్నంలో మార్పులు చేసింది. ఈ పోలీస్ లోగోలో స్టేట్ అనే పదాన్ని తొలగించి కొత్త చిహ్నాన్ని ఆ శాఖ ఆవిష్కరించింది. దీంతో తెలంగాణ స్టేట్ పోలీస్ నుంచి తెలంగాణ పోలీస్‌గా మారిందని పోలీస్ శాఖ వెల్లడించింది.