Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకుంటున్న నాయకుడు… ప్రజారాజ్యం పార్టీ చేదు అనుభవాలు చవి చూసిన కూడా మరోసారి జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. అంతేకాదు జనసేన పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా రాజకీయంగా పదేళ్లపాటు ఎన్నో కష్టాలు, నష్టాలు చవిచూసారు. కానీ ఏనాడు ముఖం చాటేయ్యలేదు. ముందుకు దూసుకుపోతూనే ఉన్నారు. 2019 ఎన్నికల్లో దారుణమైన ఓటమి అతన్ని నిరాశ పర్చకపోగా మరింత రాటుదేల్చింది. దానికి తోడు వైసీపీ నేతలు పవన్‌ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాటల తూటలు వదులుతుంటే ఒపికగా భరించారు.
కొన్ని సందర్బాలలో రాజకీయ విమర్శలను తిప్పికొట్టినా ఏ నాయకుడు కుటుంబసభ్యులను కించపర్చే విధంగా కామెంట్స్ చేయలేదు పార్టీ నేతలతో చేయనివ్వలేదు. దీనికి తోడు పవన్ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యల దగ్గరకు వెళ్లి పోరాటాలు చేశారు. మరోవైపు సొంత నిధులతో రైతు భరోసా పేరుతో ఆత్మహాత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయలు ఆర్దిక సహాయం అందించారు. జనగళం పేరుతో ప్రజా సమస్యలు స్వీకరించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. ఇలా ప్రజాక్షేత్రంలో అనేక కార్యక్రమాలతో ప్రజలకు చేరువైయ్యారు. పార్టీని బలోపేతం చేశారు.
ఇది కూడా చదవండి: Game Changer: ‘గేమ్ చేంజర్’ చిత్రంలోని కారెక్టర్ నా కెరీర్‌లో బెస్ట్ అవుతుంది
Pawan Kalyan: జనపార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు రాజకీయంగా అనుభవం తక్కువైనా… పార్టీ అధికారంలోకి రాకపోయినా కోట్లాదిమంది అభిమానుల అండదండలతో ప్రతి అడుగు అతనికి కలిసొచ్చింది. పవన్ అంటే ఒక సునామీ అని ప్రధాని అభివర్ణించారంటే అభిమానులు పవన్ చరిష్మా ఏ స్ధాయికి తీసుకెళ్లారో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి అభిమానుల అండ దండలతో పవన్‌కి వచ్చిన పరపతితో ఎక్కడా రెచ్చిపోకుండా… జాగ్రత్తగా అచీ తూచీ ఆలోచనలు చేస్తూ రాజకీయ అడుగులు వేశారు. అందులో భాగం గానే 2024 ఎన్నికలలో టీడీపీ, బీజేపీ మధ్య మరోసారి స్నేహా సంబంధాలు పెంపోందించి జనసేనతో కలిపి కూటమి ఏర్పాటు చేయడంలో సక్సెస్ అయ్యారు.
Pawan Kalyan: కుటమి ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అంతేకాదు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కూడా ఏపీ ఎంపీలు కీలకంగా మారారు అనడంలో సందేహాం లేదు. వీటన్నింటికి తోడుగా ప్రజాక్షేత్రంలో జనసేన పార్టీ పోటీ చేసిన 21 ఎమ్మేల్యేలు, 2 ఎంపీలు విజయం సాధించి దేశంలోనే 100 పర్సెంట్ సక్సెస్‌తో విజయం సాధించిన తొలిపార్టీగా నిలిచింది. ఇదంతా పవన్ ప్లానింగ్… అభిమానుల అండదండలతోనే సాద్యమని పార్టీ శ్రేణులు అభిప్రాయపడతారు. పార్టీ ఏ స్ధాయిలో ఉన్నా… మార్చి 14 అంటే జనసేనకి ఒక పండుగ… పార్టీ వ్యవస్ధాపకులు పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్బావ దినోత్సవం ఘనంగా నిర్వహిస్తారు.
Pawan Kalyan: 2025 మార్చి 14న నిర్వహించే ఆవిర్బావ దినోత్సం గతం కన్నా భిన్నంగా వైభవంగా నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.ఇందుకు సంబంధించి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్‌ను జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహార్‌కు అప్పగించారు. అధినేత ఆదేశాలతో రంగంలోకి దిగిన మనోహార్ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. మార్చి 14 ఆవిర్బావ సభను ఈ ఏడాది మూడు రోజులు పాటు ప్లీనరీ సమావేశాలుగా నిర్వహించాలని నిర్ణయించారు.పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో జనసేన పార్టీ ప్లీనరి సమావేశాలు నిర్వహించాలని డిసైడ్ చేశారు.
Pawan Kalyan: మార్చి 12, 13, 14 తేదీల్లో ఈ ప్లీనరీ సమావేశాలు ఉంటాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు, పార్టీ శ్రేణులు వచ్చి వెళ్లెందుకు అనువైన రోడ్డు కనెక్టివిటి ఉండేలా గ్రౌండ్ ఎంపిక చేయాలని పార్టీ ప్రోగ్రామ్ కన్వీనర్ కె. కెకు అప్పగించారు. గతంలో జరిగిన ఆవిర్బావ సభలలో అనుభవాలను అధిగమించడంతో పాటుగా ఇప్పటం, మచిలీపట్నం సభలలో ఎదుర్కోన్న కష్టాలను అధిగమించి ఈసారి ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలని పవన్ సూచించారు. దీంతో పార్టీ ముఖ్యనేతలు ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నారు.
ఈ ప్లీనరీ సమావేశాలతో మరోసారి జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో పిఠాపురం పేరు మారుమోగుతుంది అనడంలో ఎటువంటి సందేహాం లేదు.ఈ ప్లీనరీ ద్వారా జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పవన్ ఆలోచనలు చేస్తున్నారు. మూడు రోజులలో పార్టీ క్యాడర్‌కు ముఖ్యనేతలకు అభిమానులకు జనసేనాని దిశనిర్దేశం చేయనున్నారు. ఏమైనా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలుకాకు సందండే సందండి… మిమ్మల్ని ఎవడ్రా ఆపేదీ..
ఇది రాసిన వారు
మురళీ మోహన్
ఏపీ బ్యూరో చీఫ్
అమరావతి