Pakistani MP

Pakistani MP: మా ప్రధానే పిరికోడు..పీఎం మోదీ పేరు చెప్పడానికి భయపడుతున్నాడు..పాకిస్తాన్ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు

Pakistani MP: పహల్గాం ఉగ్రదాడి ఘటన పాక్‌కు తీవ్రంగా తిరగబడ్డది. దేశ భద్రతను పాతికో వేసే ఉగ్రవాదుల దుష్టక్రీడను తుడిచిపెట్టేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పాక్‌ను తీవ్రంగా తాకింది. ఒక్కసారిగా తొమ్మిది ఉగ్రశిబిరాలను, ఆయుధ నిల్వలతో పాటు కీలక రాడార్ వ్యవస్థను భారత బలగాలు ధ్వంసం చేశాయి. ఈ ప్రతీకార దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ రాజకీయ వ్యవస్థ లోపలే కలకలం రేగింది.

భారత దాడులకు సరిగా స్పందించలేక, దేశ భద్రతపై స్పష్టత ఇవ్వలేక పోతున్నాడంటూ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌పై ఆ దేశ ఎంపీలు రగిలిపోతున్నారు. తాజాగా జాతీయ అసెంబ్లీలో పీటీఐ ఎంపీ షాహిద్ అహ్మద్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. “మన ప్రధాని పిరికి వాడు. మోదీ పేరెత్తే ధైర్యం కూడా ఆయనకిలేదు. సింహాల గుంపును నక్కలు నడిపితే ఎలా పోరాడగలవు?” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

పాక్ సైన్యం ఎదురుదెబ్బలు… ప్రధాని స్టేట్మెంట్‌కు టైం లేదా?

భారత వైమానిక దాడుల్లో పంజాబ్ ప్రావిన్స్‌లో పాక్‌కు చెందిన మూడు కీలక విమానాలు నేలకూలిపోయిన సంగతి తెలిసిందే. ఆ దెబ్బతో షెహబాజ్ నివాసం సమీపంలో పేలుళ్లు సంభవించినట్టు వార్తలు వస్తున్నా, పాక్ అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. ఇక, సరిహద్దు గ్రామాలపై పాక్‌ కాల్పులు కొనసాగుతున్నా, భారత సైన్యం నిర్ధాక్షిణ్యంగా ప్రతీకారం తీర్చుకుంటోంది.

ఇది కూడా చదవండి: India-Pakistan Tension: ఫేక్ న్యూస్ పై కేంద్రం ఉక్కు పాదం.. వేలల్లో ట్విట్టర్ ఖాతాల నిషేధం

ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “భారత దళాలు మాదేశ భూభాగంలోకి చొచ్చుకొచ్చి దాడులు చేస్తుంటే మన ప్రధాని నోరు మెదపడం లేదు. ప్రజలకు సర్దిచెప్పడం లేదు. సైనికులకు ఏ ఆదేశాలు ఉన్నాయో కూడా చెప్పడం లేదు” అని మండిపడ్డారు ఎంపీ షాహిద్ అహ్మద్.

భయంతో కాదు… ధైర్యంతో ఎదురు కావాలి అంటున్న నేతలు

పాక్ ప్రభుత్వం మొండిగా మౌనం పాటిస్తుండడంపై దేశ ప్రజల్లో అసహనం పెరుగుతోంది. పాక్ మీడియా కూడా ఈ దాడులను తక్కువచేసి చూపించేందుకు ప్రయత్నిస్తుండగా, వాస్తవాలు మాత్రం విడదీయనివిగా మారాయి. భారత దాడులతో తీవ్ర నష్టం వాటిల్లిందన్న విషయం చుట్టుపక్కల చెబుతున్నారు కానీ అధికారికంగా మాత్రం ఖండించలేని స్థితిలో పాక్ ఉంది.

ఇప్పుడు అక్కడి రాజకీయ నాయకులే నడుపుతున్న ప్రభుత్వం తీరు వల్లే దేశం ఇలా గుంతలో పడుతోందని ఆరోపిస్తున్నారు. ఈ స్థితి మరింత ముదిరితే పాక్ రాజకీయాల్లో మరోసారి సైన్యం పాత్ర పెరిగే అవకాశముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *