Ileana: ఇలియానా.. ఒకప్పుడు టాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ టైంలోనే దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టింది. కిక్, పోకిరి, జులాయి.. వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తన ఖాతాలో వేసుకుంది. నటనతోపాటు అందం పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ అంతే త్వరగా ఇక్కడ ఆఫర్లు తగ్గడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయిన ఈ అక్కడ కూడా పర్వాలేదు అనిపించుకుంది.
ఇలియానా చివరిసారిగా గుహ ఠాకుర్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ ‘దో ఔర్ దో ప్యార్ ‘లో కనిపించింది. ఈ చిత్రంలో విద్యాబాలన్, ప్రతీక్ గాంధీ తదితరులు నటించారు. ఇక పోతే ప్రజంట్ ఈ గోవా బ్యూటీ సినిమాలను తగ్గించుకుని, పూర్తిగా పర్సనల్ లైఫ్ పైనే ఫోకస్ చేసింది. త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న ఈబ్యూటీ తాజాగా సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో ముచ్చటించింది. ఒక అభిమాని పిల్లలు మంచిగా పెరగాలి అంటే తల్లిగా ఏం చేయాలి? నిజమైన ప్రేమ అంటే ఏమిటి? అని అడిగారు.
ఈ ప్రశ్నకు స్పందించిన ఇలియానా.. ‘పిల్లల్ని ప్రేమ ‘సంపాదించుకోవాలి’ అనే విధంగా మాత్రం పెంచను. ఎందుకంటే నేను అనుభవించిన అత్యంత చెత్త అనుభూతి అది. ప్రేమ స్వతహాగా ఉండాలి. అది సంపాదించుకుంటే వచ్చేది కాదు. గౌరవం ఆనందంలా ప్రేమ కూడా సహజంగా వచ్చేది. ‘ప్రేమ సరిపోలేదు’ అనే భావన అస్సలు వారికి రాకూడదు. నేను సంతోషంగా, ఆరోగ్యంగా జీవించే దయగల పిల్లలుగా పెంచాలనుకుంటున్నాను. అందరు పేరెంట్స్ అలానే భావిస్తారు. పిల్లలు ఎంతగా ప్రేమించబడుతున్నారో తె లుసుకోవడానికి నేను నా వంతు కృషి చేస్తాను. సహజ సిద్ధమైన తల్లి ప్రేమ, ఎమోషన్ని ఇష్టపడతాను’ అని చెప్పుకొచ్చింది. కాగా.. ఇలియానా 2021లో విదేశీ ప్రియుడు మైఖేల్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే.