OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగలాంటి అప్‌డేట్! సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఓజి’ షూటింగ్ మళ్లీ ఊపందుకుంది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రం, హై ఓల్టేజ్ యాక్షన్‌తో అదరగొట్టనుంది. తాజాగా కెమెరా డిపార్ట్‌మెంట్ సభ్యుడు షేర్ చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ రోజు నుంచి షూటింగ్ తిరిగి ప్రారంభమైందని, త్వరలో పవన్ కళ్యాణ్ సెట్స్‌లో జాయిన్ కానున్నారని సమాచారం.
పవన్ లేకుండా కొన్ని రోజులు షూటింగ్ కొనసాగినప్పటికీ, ఈ వారంలో హీరో-విలన్ మధ్య కీలక సీన్స్ చిత్రీకరణ జరగనుంది. ఈ సీన్స్ ఎప్పుడు పూర్తవుతాయి, సినిమా రిలీజ్ ఎప్పుడు అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. ‘ఓజి’తో పవన్ మరోసారి బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయం!
