Nvss Prabhakar: జూన్ 2న కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం

Nvss Prabhakar: బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని ఆయన ఆరోపించారు. త్వరలో రేవంత్ రెడ్డి స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనమవుతున్నదని, అది జూన్ 2 లేదా డిసెంబర్ 9 తర్వాత జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇటీవల హరీష్ రావు చేసిన “కేటీఆర్ నాయకత్వంలో పని చేస్తాను” అన్న వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఊహాగానాలకు దారితీశాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *