NTR-Prashanth Neel: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కెజియఫ్, సలార్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడం ఒకటైతే ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో సినిమా మామూలు అంచనాలు లేవు. టైగర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫైనల్‌గా మేకర్స్ షూటింగ్‌కు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఫిబ్రవరి ఎండింగ్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. అయితే ఈ సినిమాలో చాలా అవుట్ డోర్ షెడ్యూల్స్ ఎక్కువగా ఉంటాయని తెలుస్తుంది. ఈ సినిమా హైదరాబాద్, కోల్‌కతా, గోవా మరియు శ్రీలంకతో పాటు ఇతర ప్రదేశాలలో షూట్ అవుతుందని అంటున్నారు. ప్రశాంత్ నీల్ కి ఇది ఒక ప్రతిష్టాత్మకమైన సినిమా కావడంతో కథ సాధ్యమైనంత రిచ్ గా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. షూట్ ఈ నెలలో ప్రారంభమవుతుంది. ఎన్టీఆర్ వచ్చే నెల లేదా ఏప్రిల్ ప్రారంభంలో సెట్స్‌లో చేరనున్నారని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 9, 2026న థియేటర్లలోకి రానుంది.
