NTR – Neil: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్‌లో భారీ చిత్రాలతో సందడి చేస్తున్నారు. ప్రశాంత్ నీల్‌తో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు, దీని అనౌన్స్‌మెంట్ నుంచే అమేజింగ్ హైప్ క్రియేట్ అయింది. షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది, ఎన్టీఆర్ ఏప్రిల్ నుంచి జాయిన్ కానున్నారు. ఆయన సెట్స్‌లోకి రాకముందే ఈ సినిమా బిజినెస్ డీల్స్ క్లోజ్ అవుతున్నాయి.
Also Read: Tanikella Bharani: నూతన నటీనటులకు తనికెళ్ళ భరణి అవకాశం!
NTR – Neil: నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్‌ను ప్రత్యంగిరా సంస్థ భారీ మొత్తానికి సొంతం చేసుకొని రిలీజ్‌కు సన్నాహాలు చేస్తోంది. దీంతో ఈ సినిమా మళ్లీ వార్తల్లో నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్ నీల్ యాక్షన్, ఎన్టీఆర్ మాస్ ఎనర్జీ కలవనున్నాయి. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని, టాలీవుడ్‌లో మైలురాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.