Sai Marthand

Sai Marthand: లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ తో నితిన్ మూవీ…?

Sai Marthand: టాలెంట్ అంటే టాలెంట్‌నే… కానీ అదృష్టం కూడా కాస్త తోడైతేనే హిట్‌లు వస్తాయి. టాలీవుడ్‌లో ఈ మాటకు మంచి ఉదాహరణ హీరో నితిన్. స్మార్ట్ లుక్స్, మంచి డ్యాన్సర్‌, ఎమోషనల్ యాక్టర్ అన్నీ ఉన్నా గత కొంతకాలంగా విజయాలు మాత్రం దూరమవుతున్నాయి. వరుసగా ఫ్లాప్స్ చూసిన నితిన్ ఇప్పుడు కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచే ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడనే వార్తలు వస్తున్నాయి.

కొత్త దిశలో నితిన్

సమాచారం ప్రకారం, నితిన్ ఇటీవల ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో పెద్ద హిట్ సాధించిన దర్శకుడు సాయి మార్తాండ చెప్పిన కథ విన్నాడట. ఏషియన్ ఫిలిమ్స్ కార్యాలయంలో ఇద్దరి మధ్య మీటింగ్ కూడా జరిగినట్లు సమాచారం. ఈ కథ నితిన్‌కి బాగా నచ్చిందని, చివరి చర్చలు పూర్తయ్యే దశలో ఉన్నాయని తెలుస్తోంది. చిన్న బడ్జెట్‌తో, హృదయానికి హత్తుకునే లవ్ స్టోరీగా రూపొందనున్న ఈ సినిమా నితిన్‌కి సరైన కమ్‌బ్యాక్ అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు.

అవసరమైతే రెమ్యూనరేషన్‌ లేకుండానే?

ఇండస్ట్రీ టాక్ ప్రకారం, స్టోరీ నిజంగా బలంగా అనిపిస్తే నితిన్ తన రెమ్యూనరేషన్ కూడా వదిలి సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడట. “ఇప్పుడు హిట్ కావడమే ముఖ్యం” అని అతడు దగ్గరి వర్గాల్లో చెప్పాడని సమాచారం. ప్రస్తుతం నితిన్‌కు పెద్ద బడ్జెట్ సినిమాల కంటే సాలిడ్ కంటెంట్ ఉన్న సినిమా అవసరమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Akshay Kumar: కొత్త నటులకు అక్షయ్ కుమార్ విలువైన సలహా!

సాయి మార్తాండ్ – కొత్త స్టార్ దర్శకుడు

‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో సాయి మార్తాండ్స్ టాలీవుడ్‌లో సంచలన విజయాన్ని అందుకున్నాడు. కేవలం ₹2.5 కోట్లు బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా ₹32 కోట్లు వసూలు చేసింది. దీంతో సాయి మార్తాండ్కి పెద్ద అవకాశాలు వరుసగా వస్తున్నాయి. ఇప్పటికే జగపతి బాబు నిర్మాతగా అడ్వాన్స్ ఇచ్చారని, తాను ఆ ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నానని సాయి మార్తాండే వెల్లడించాడు.
ఇప్పుడు నితిన్‌తో ఆయన కలయిక జరిగితే, ఇది మధ్యస్థ బడ్జెట్‌లో కంటెంట్ బేస్డ్ హిట్‌గా మారే అవకాశం ఉందని టాక్.

హిట్ల కోసం ఎదురుచూపులు

నితిన్ కెరీర్‌కి ‘జయం’, ‘దిల్’, ‘సై’, ‘ఇష్క్’, ‘భీష్మ’ వంటి సినిమాలతో వచ్చి హిట్ కొట్టారు. కానీ ఆ తర్వాత వరుసగా చెక్, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్ వంటి సినిమాలు ఫెయిల్ అవడంతో నితిన్ ఇమేజ్ కాస్త తగ్గింది. మధ్యలో ‘రంగ్ దే’ పర్వాలేదనిపించినా పెద్ద హిట్ ఇవ్వలేదు.

ఇక మళ్లీ నితిన్ పయనం?

విక్రమ్ కె. కుమార్‌ నుంచి త్రివిక్రమ్‌ వరకు పలు స్టార్ డైరెక్టర్లతో పనిచేసినా, పెద్ద సక్సెస్‌లు అందుకోలేకపోయాడు. ఇప్పుడు సాయి మార్తాండ్లాంటి యువ దర్శకుడి కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, అదే నితిన్‌కు కొత్త దిశగా మారవచ్చు. అయితే మరోవైపు, నితిన్ చేయబోతున్నట్లు చెప్పిన వేణు ఎల్లమ్మ సినిమా నుంచి తప్పుకున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *