Swayambhu

Swayambhu: స్వయంభు.. నిఖిల్ ఎంట్రీ సీన్ వేరే లెవెల్?

Swayambhu:  హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం స్వయంభు. పూర్తి పీరియాడికల్ మైథాలజికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిఖిల్ రాజు పాత్రలో కనిపించనున్నాడు. ఆయన ఎంట్రీ సీన్ భారీ వార్ సీక్వెన్స్‌తో ఉంటుందని సమాచారం. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.

Also Read: Kingdom-2: ‘కింగ్‌డమ్’ బాక్సాఫీస్ దెబ్బకు సీక్వెల్ ప్రాజెక్ట్ ఆగిపోయిందా?

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం స్వయంభు. పూర్తి మైథాలజికల్ పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు సృష్టిస్తోంది. నిఖిల్ రాజు పాత్రలో నటిస్తూ భారీ వార్ సీక్వెన్స్‌తో సినిమాకు ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సన్నివేశం విజువల్స్ అద్భుతంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. సంయుక్త మీనన్, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. కె కె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ ఆధ్వర్యంలో భువన్, శ్రీకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా ఠాగూర్ మధు సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 13న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. త్వరలోనే ప్రచార కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *