Niharika: మెగా ఫ్యామిలీకి చెందిన నిహారిక కొనిదెల ఎప్పుడూ ఏదో ఒక కారణంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, కెరీర్, కుటుంబ బంధాలపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా, “నేను సెపరేట్‌గా ఉంటున్నాను కానీ కుటుంబానికి దూరం కాలేదు” అనే వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.
విడిగా జీవనం.. కానీ బంధాలకు దూరం కాదు
వ్యాపారవేత్త చైతన్య జొన్నలగడ్డతో విడాకుల తర్వాత నిహారిక ప్రస్తుతం ఒంటరిగా జీవిస్తున్నారు. అయితే, “రెండు రోజులకు ఒకసారి మా ఇంటికి వెళ్తాను. పెదనాన్న, నాన్న, బాబాయ్, అన్నయ్యలు నా బలం అన్నారు.
వరుణ్ తేజ్‌కి కుమారుడు పుట్టడంతో నిహారిక ఆనందం
“మా అన్న వరుణ్ తేజ్‌కి కొడుకు పుట్టాడు. నేను బాబుని ఎత్తు కుంటే ఎవరు నాకు పని చెప్పడం లేదు. సాధారణంగా ‘నీళ్లు తీసుకురా’, ‘అది తీసుకురా’ అని చెబుతుంటారు. కానీ ఇప్పుడు ఎవరూ ఏం అనడం లేదు” అంటూ నవ్వుకున్నారు. అంతేకాదు, “వాడు పెద్దయ్యాక యాక్టింగ్ లోకి వెళ్తా అంటే నా బ్యానర్లోనే సినిమా చేస్తాను” అని ఆసక్తికరంగా చెప్పారు.
ఇది కూడా చదవండి: TGSRTC Jobs 2025: ఐటీఐలో చేశారా.. రాత పరీక్ష లేకుండా జాబ్ పొందండి
నిర్మాతగా దూసుకెళ్తున్న నిహారిక
హీరోయిన్గా ఎక్కువ విజయాలు సాధించలేకపోయినా, నిహారిక నిర్మాతగా బలమైన స్థానం సంపాదించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ముద్దపప్పు అవకాయ్, నాన్న కూచీ, మ్యాడ్ హౌస్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హలో వరల్డ్ వంటి వెబ్‌సిరీస్‌లు నిర్మించారు. గతేడాది వచ్చిన కమిటీ కుర్రోళ్లు మంచి కలెక్షన్లు రాబట్టడమే కాకుండా గద్దర్ అవార్డు కూడా గెలుచుకుంది. ప్రస్తుతం సంగీత్ శోభన్ హీరోగా మానస శర్మ దర్శకత్వంలో మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘ఓజీ’ ఫీవర్ ఇంట్లోనే
తాజాగా విడుదలైన పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ గురించి కూడా నిహారిక మాట్లాడారు. “ఆ సినిమా మేము ఊహించిన దానికంటే అద్భుతంగా వచ్చింది. ఇంట్లో అందరికీ ఓజీ ఫీవర్ పట్టేసింది” అని ఆమె తెలిపారు.
వ్యక్తిగత దెబ్బ.. కానీ ధైర్యంగా ముందుకు
వివాహ బంధం ఎక్కువ కాలం నిలవకపోవడం నిహారిక జీవితంలో పెద్ద దెబ్బగా మారింది. అయితే, తన కుటుంబం అండగా ఉందని, అదే తనకు బలం అని స్పష్టం చేశారు. “జీవితంలో ఏం జరిగినా, మా కుటుంబం నన్ను ఎప్పుడూ నిలబెట్టే శక్తి” అని నిహారిక ధైర్యంగా చెప్పడం గమనార్హం.