Peddi: రామ్ చరణ్ పుట్టినరోజు స్పెషల్‌గా మార్చి 27న ‘పెద్ది’ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది! దర్శకుడు బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న ఈ చిత్రంపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజా పోస్టర్‌లో రామ్ చరణ్ సిగరెట్‌తో సీరియస్ మాస్ లుక్‌లో దుమ్మురేపాడు. ఈ స్టైల్ చూసిన ఫ్యాన్స్.. అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాను గుర్తు చేస్తుందని అంటున్నారు. ‘పుష్ప’ మాస్ వైబ్ సృష్టించగా, ‘పెద్ది’ కూడా అదే బాటలో ఉందని టాక్ నడుస్తోంది. కానీ ‘పుష్ప’ స్మగ్లింగ్ నేపథ్యంలో ఉంటే, ‘పెద్ది’ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది.ఈ సినిమాలో స్పోర్ట్స్‌తో పాటు ఎమోషన్స్, మాస్ డోస్ కూడా ఉంటాయని తెలుస్తోంది. ‘ఉప్పెన’తో హిట్ కొట్టిన బుచ్చిబాబు ఇప్పుడు ‘పెద్ది’ని భారీ స్కేల్‌లో తెరకెక్కిస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. మొత్తానికి రామ్ చరణ్ కొత్త లుక్‌లో రచ్చ చేస్తున్నాడు. ఒక్క పోస్టర్‌తోనే హైప్ పీక్స్‌కి చేరింది. సినిమా ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
