Nellore

Nellore: మేకపాటోళ్ల జోష్… కాకర్ల అతి కారణమా ?

Nellore: ఉమ్మడి నెల్లూరు జిల్లా 2024 ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ గెలవడం అంటే పెద్ద అధ్బుతం జరగాలన్నారు.అలాంటిది చంద్రబాబు బొమ్మ, జగన్ అంటే భయంతో రెడ్ల సామాజికవర్గం పెత్తనం నూటికి నూరు శాతం ఉండే ఉదయగిరిలో కాకర్ల సురేష్ అనే కొత్త ఫెస్ అనూహ్యంగా విజయం సాధించారు. జగన్ అంటే భయంతో పాటు కాకర్ల సురేష్‌పై నమ్మకం, కాకర్ల ఛారిటబుల్ ట్రస్ట్ సేవ కార్యక్రమాలు కూడ టీడీపీ విజయానికి ఉపయోగపడ్డాయి.

Nellore: ఉమ్మడి నెల్లూరు జిల్లా 2024 ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ గెలవడం అంటే పెద్ద అధ్బుతం టీడీపీకి చెందిన కొందరు బడా లీడర్స్ వైసీపీకి అమ్ముడుపోయారని, కాకర్లకు వెన్నుపోట్లు పోడిచారని ప్రచారం జరిగిన కూడ వాళ్ల కుట్రలను ఎదుర్కోని పక్కగా ఎలక్షన్ చేసి కాకర్ల సురేష్ ఫస్ట్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కూడ అసెంబ్లీలో అధ్యక్ష అనే లక్కును దక్కించుకున్నారు. కాకర్ల సురేష్ సొంత టీమ్‌తో 2024 ఎన్నికలను ఫెస్ చేసిన విధానం కానీ, చాలమంది టీడీపీ నాయకులు పాత లీడర్స్‌కు టికెట్ రాలేదని వైసీపీకి లోలోన పని చేసిన కూడ కాకర్ల సొంత మనుషులు, కుటుంబ సభ్యుల సహకరంతో గెలిచిన తీరు ఆశ్చర్యానికి గురి చేసింది.

Nellore: ఉమ్మడి నెల్లూరు జిల్లా 2024 ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ గెలవడం అంటే పెద్ద అధ్బుతంప్రత్యర్ది మేకపాటి రాజగోపాల్ రెడ్డి, ఆయన కుమారుడు అభినవ్ రెడ్డి 2024 ఎన్నికల్లో ఓటమి తరువాత కూడ ఉదయగిరి వైసీపీ పగ్గాలు వదలకుండ రాజకీయం చేస్తున్నారు. వైసీపీ కోసం సోంత డబ్బు ఖర్చు చేసి 2024 ఎన్నికల్లో చోక్కాలు చించుకుని పని చేసిన 8 మండలాల నేతలు ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ఉదయగిరిలో వైసీపీ గెలవడం పక్కా అంటూ హంగామా చేస్తున్నారు. ఇది వారి పార్టీ లైన్ అనుకొంటే ఓకే… కానీ టీడీపీకి వచ్చే సరికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అండ్ టీమ్ ఎన్నికల తరువాత పూర్తయి ప్రత్యర్థుల పాపలను గుర్తించి చట్టపరంగా

ఇది కూడా చదవండి: Railway Job Fraud: ఘరానా మోసం…రైల్వే జాబ్ కావాలంటే 8 లక్షలు ఇవ్వండి

తీసుకోవాల్సిన చర్యలపై కూడ రియాక్ట్ కావడంతో ఫెయిల్ అయిపోతుందని ఉదయగిరి టీడీపీ లీడర్స్‌కు ఆవేదనగా ఉందంటా…
వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ లీడర్స్ పైన పెట్టిన అక్రమ కేసులు కూడ ఇంక కోట్టేయాలేదని, పోలీసులు, రెవెన్యూ అధికారులు వైసీపీ లీడర్స్‌కు రాచమర్యాదలు చేస్తూ అన్ని పనులు చేసిపెడుతున్నారనీ టాక్‌ నడుస్తోంది.

Nellore: ఉమ్మడి నెల్లూరు జిల్లా 2024 ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ గెలవడం అంటే పెద్ద అధ్బుతం కాకర్ల సురేష్ ఎన్నికల తరువాత కనిపించాడు… కాకర్ల సురేష్ దగ్గర డబ్బు లేదు, ఎలక్షన్ చేయలేడు అనే చీప్ ప్రచారంతో పాటు సోషల్ మీడియాలో కాకర్ల బ్యాచ్‌ని నీచంగా పబ్లిసిటీ చేసిన వైసీపీ లీడర్స్ ప్రజెంట్ హ్యపీగా జై జగన్ అంటూ తమ పార్టీ పనిలో బిజీగా మారిపోయారంటా..కనీసం చట్టం అంటే భయం కూడ లేకుండా మేకపాటి రాజగోపాల్ రెడ్డి బ్యాచ్‌ని, కాకర్ల సురేష్ వదిలేయడంతో ఉదయగిరిలో వైసీపీ, మేకపాటి బ్యాచ్ చాల బలంగా తిరిగి పుంజుకున్నారని టాక్ నడుస్తోంది. ఎప్పుడు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగిన వైసీపీ ఉదయగిరి అంత మెజారిటీ స్దానాల్లో గెలుస్తుందని పార్టీ ఇన్‌ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి అధినేతకు హమీ ఇచ్చారంటా…

Nellore: ఉమ్మడి నెల్లూరు జిల్లా 2024 ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ గెలవడం అంటే పెద్ద అధ్బుతంవాస్తవానికి ఉదయగిరిలో కూడ వైసీపీ లీడర్స్ తమకున్న డబ్బు పవర్‌తో, రకారకాల పలుకుబడితో ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ని కేర్ చేయడం లేదంటా..పోలీసు, రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకుని ఉదయగిరి అంత వైసీపీ రాజ్యం నడిచేలా ప్లాన్ ప్రకారం ముందుకు పోతున్నారంటా..వైసీపీకి అధికారం పోతే ఉదయగిరిలో తల ఎత్తుకోలేము, బెంగుళూరు, హైదరబాద్, ముంబాయిలకు పోయి వ్యాపారాలు చేసుకుందామని డిసైడ్ అయిన లీడర్స్ చాల మంది ఇప్పుడు, అబ్బే ఈ ఎమ్మెల్యేకు అంత సీన్ లేదు.
కాకర్ల టీమ్ ఏదో కార్పోరేట్ టైప్‌లో పని చేస్తుంది. నియోజకవర్గం కదలక్కర్లేదు.

మనల్ని ఇక్కడ పీకే టీడీపీ మొనగాడు ఎవడు లేడని మందు సిట్టింగ్స్‌లో జోక్స్ వేసుకుంటున్నారంటా… ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాజిటివ్ పాలిటిక్స్ చూసిన టీడీపీ లీడర్స్ కొంత మంది పాత వైసీపీ లీడర్స్, కాంట్రాక్టర్లతో కలిసిపోయి రియల్ ఎస్టేట్, కాంట్రాక్ట్‌లు చేసుకోవడంలో బిజీ అయిపోయారంటా… కడుపు మండిన కార్యకర్తలు వైసీపీతో ఎలా కలుస్తారని నిలదీస్తే, మేము ఏమి చేస్తాం… మన ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌నే వైసీపీ అక్రమాలపై పట్టించుకోవడం లేదు. మనకెందుకు పార్టీ గోడవలు అంటు సోంత లాభం చూసుకుంటున్నారని టాక్ నడుస్తోంది.

ఇది కూడా చదవండి: Kandanavolu: కందనవోలు దశ దిశ మార్చే ప్రాజెక్టులు!

Nellore: ఉమ్మడి నెల్లూరు జిల్లా 2024 ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ గెలవడం అంటే పెద్ద అధ్బుతంసోంత లాభం చూసుకోకుండా, వైసీపీ ప్రత్యర్థులను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టకుండా, ఉదయగిరి అభివృద్ధికి రకారకాలుగ
శ్రమిస్తున్న కాకర్ల సురేష్ విజన్‌ని ఎవరు తప్పుపట్టారు కానీ,5 ఏళ్లు టీడీపీ క్యాడర్‌ని అల్లాడించి, అవమానించిన వైసీపీ లీడర్స్ అక్రమాలని గాలికి వదిలేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మేకపాటి రాజగోపాల్ రెడ్డి, అభినవ్ రెడ్డిలు ఉదయగిరిలో వైసీపీని జస్ట్ పవర్ పోయిన 8 నెలల్లో తిరిగి బలంగా తయారు చేశారంటే దానికి కాకర్ల సురేష్ అసమర్థతే కారణం అనే ప్రచారం కూడ వైసీపీనే మొదలుపెట్టింది.

ఉదయగిరిలో అభివృద్ధి గత పాతికేళ్లుగా లేదు. వీటన్నింటిని అధిగమించి ఉదయగిరిలో టీడీపీ మార్క్ అభివృద్ధి చూపాలి. కాకర్ల సురేష్ విజన్ ఉన్న లీడర్ అనిపించుకోవాలని ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ రాజకీయం వదిలేయడం వైసీపీ బలంగా తయారయ్యే లాగ తప్పులు చేయడం కాకర్ల రాజకీయ భవిష్యత్తును జస్ట్ ఐదేళ్లకే పరిమితం చేసే ప్రమాదం ఉందని కూడ రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. చూడాలి కాకర్ల ఇకనైన రాజకీయం కాక పెంచి వైసీపీ ఇన్‌ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డిని వెంటాడి, అక్రమలపై చర్యలు తీసుకుంటారా లేక సినిమా పాలిటిక్స్ చేసి మైనస్‌లో పడిపోతారా అనే ఆసక్తి వ్యక్తం అవుతుంది.

ఇది రాసిన వారు:

దినకర్‌ రాజు
మహాన్యూస్ స్టాప్ రిపోర్టర్
ఉమ్మడి నెల్లూరు జిల్లా…

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *