Kandanavolu: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆరు నెలలు పూర్తి కావడంతో టీడీపీ కర్నూలు జిల్లాపై ఫోకస్ పెట్టింది. పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు దూకుడు పెంచుతుంది.క్లీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రానికి భారీ కంపెనీలు వచ్చాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా ఐదు సంస్థలు, 83 వేల కోట్ల పెట్టుబడులతో వివిధ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. వీటివల్ల క్లీన్ ఎనర్జీ రంగంలోనే రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల 50 వేల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.
Kandanavolu: రాష్ట్రంలో వివిధ పరిశ్రమల స్థాపనకు పలు కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. అందులో భాగంగానే కర్నూలు జిల్లాలోని హోసూరు, పెద్దహుల్తిలో టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్‌ను స్థాపించేందుకు ముందుకు వచ్చింది. ఇందులో సుమారు 18 వందల ఎకరాల్లో రెండు వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న 400 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
అలాగే నంద్యాల జిల్లాలోని బనగానపల్లె నియోజకవర్గం కొలిమిగుండ్లలో మొత్తం 1,080 ఎకరాల్లో 119 మెగావాట్ల విండ్ పవర్, 130 మెగావాట్ల సోలార్ హైబ్రిడ్ సిస్టమ్, బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థ ఏర్పాటుకు గ్రీన్ రెన్యువబుల్,హైబ్రిడ్ ఎనర్జీ సిస్టమ్, త్రీ ప్రైవేట్ లిమిటెడ్ 2000 కోట్ల పెట్టుబడులు పెడుతుంది.ఈ భారీ పరిశ్రమల వల్ల ఉమ్మడి కర్నూలు జిల్లాలో 650 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయి .
ఇది కూడా చదవండి: Sankranthi Festival: ముచ్చటైన మూడు పండుగలు.. ఆధ్యాత్మిక.. లౌకిక సంబరాలు
Kandanavolu: ఇంతకీ రెన్యువబుల్ ఎనర్జీ సంస్థల స్థాపనతో ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది.ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం రెన్యువబుల్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది.ఇప్పటికే ప్రజలు సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకున్న పీఎం సూర్య ఘర్- ముఫ్త్ బిజిలి యోజన స్కీంను వాడుకుంటున్నారు.అయితే ఈ స్కీం ద్వారా దేశవ్యాప్తంగా కోటి ఇళ్లలో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.దీంతో సోలార్ పవర్‌ను మరింత వేగంగా సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందించారు.
Kandanavolu: అందులో భాగంగానే ఉమ్మడి కర్నూలు జిల్లాకు భారీ పరిశ్రమలు వస్తున్నాయి టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థలు కర్నూలు జిల్లా చిన్న హుల్తి లోఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది ఇందులో భారీగా పెట్టుబడులు పెట్టడంతో పాటు అనేకమందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.ఇటు నంద్యాల జిల్లాలో కూడా భారీ పరిశ్రమ వస్తున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వాసులు , నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ పరిశ్రమలను తీసుకురావడంతో జిల్లా ప్రజలు అటు నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వేల కోట్లు పెట్టుబడులు పెట్టే పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. దీంతో అనేక మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని నిరుద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇది రాసిన వారు:
ఖలీల్
సీనియర్ కరస్పాండెంట్
కర్నూలు జిల్లా