Aditya Roy Kapur

Aditya Roy Kapur: మూడోసారి జోడీ కట్టబోతున్న జంట!

Aditya Roy Kapur: ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ‘ఆషికీ -2’ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. మ్యూజికల్ గానూ పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత ఆ సూపర్ హిట్ జోడీ ‘ఓకే జాను’ మూవీలో కలిసి నటించారు. ఈ సక్సెస్ ఫుల్ జంట ఇప్పుడు మూడోసారి జత కట్టబోతోంది. మోహిత్ సూరి వీరిద్దరితోనూ ఓ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్ట్ పై చర్చలు జరుగుతున్నాయని, ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ తో ఓ మంచి రొమాంటిక్ డ్రామాను తీయబోతున్నానని మోహిత్ సూరి తెలిపాడు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Revanth Reddy: సీఎం ప్రకటనతో సినిమా హాల్స్ హ్యాపీ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *