Nayanthara

Nayanthara:  నయనతార విడాకుల వార్తలు.. షాకింగ్ ఫొటోతో క్లారిటీ!

Nayanthara: గత కొద్ది రోజులుగా సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార, ఆమె భర్త, దర్శకుడు విగ్నేష్ శివన్ విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. ఈ వార్తలు అభిమానుల్లో తీవ్ర ఆందోళన కలిగించాయి. అయితే, ఈ పుకార్లకు నయనతార ఒక్క షాకింగ్ ఫొటోతో చెక్ పెట్టారు.

అసలేం జరిగింది?
నయనతార తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన తర్వాత ఈ విడాకుల వార్తలు మొదలయ్యాయి. ఆ పోస్ట్‌లో “తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు మ్యారేజ్ అనేది పెద్ద మిస్టేక్” అంటూ వైవాహిక జీవితం గురించి ఆసక్తికర కామెంట్లు చేశారని, “నీ భర్త చేసే పనులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పురుషులు సాధారణంగా మెచ్యూర్ కాదు” అని ఆమె పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ పోస్ట్ స్క్రీన్‌షాట్ ఫేక్ అని తర్వాత తేలింది.

క్లారిటీ ఇచ్చిన నయనతార
ఈ విడాకుల పుకార్లపై నయనతార మొదటిసారి స్పందించారు. తన భర్త విగ్నేష్ శివన్‌తో కలిసి దిగిన ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “మా గురించి ఏదైనా సిల్లీ న్యూస్ వచ్చినప్పుడు మా రియాక్షన్ ఇదే” అంటూ రాసుకొచ్చారు. ఆ ఫొటోలో విగ్నేష్ శివన్ నేలపై పడుకుని ఉండగా, ఆయనపై నయనతార ఎక్కి కూర్చుని, ఏదో చూసి ఆశ్చర్యపోయినట్లుగా ఒక షాకింగ్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు.

ఈ ఒక్క ఫొటోతో నయనతార తమ మధ్య ఎలాంటి సమస్యలు లేవని, విడాకుల వార్తలు అవాస్తవాలని స్పష్టంగా తెలియజేశారు. అంతేకాకుండా, ఇటీవల నయనతార దంపతులు తమ పిల్లలతో కలిసి పళని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ కనిపించారు. ఈ పరిణామాలతో నయనతార, విగ్నేష్ శివన్ విడాకుల వార్తలకు తెరపడింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Kancharla Chandrashekar: అల్లు మామకు బిగ్ షాక్..పట్టించుకోని దీపాదాస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *