Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ నామినేషన్ వేశారు. ఆయన తన తండ్రి శ్రీశైలం యాదవ్ ఆశీర్వాదం తీసుకుని నామినేషన్ వేయడం విశేషం. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట స్వామి, మేయర్ గద్వాల విజయ లక్ష్మీతో పాటు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. షేక్ పేట్ ఎమ్మార్వో కార్యాలయంలో నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు.
‘స్థానిక’ నినాదంతో దూసుకుపోతున్న నవీన్ యాదవ్
దివంగత బీఆర్‌ఎస్ నాయకులు మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్‌లో ఉపఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సానుభూతి ఓట్లపై నమ్మకం పెట్టుకుంది. అయితే, సానుభూతి ఒక్కటే సరిపోదనుకుందో ఏమో, బీఆర్‌ఎస్ నాయకత్వం ‘నకిలీ ఓట్లు’ అంశాన్ని పెద్దగా ప్రచారం చేస్తోంది. అధికారులు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని కూడా ఆరోపిస్తున్నారు. కానీ, ప్రజలు ఈ మాటలను అంతగా నమ్మడం లేదు.
Also Read: Bhatti Vikramarka: సింగరేణి కార్మికులకు శుభవార్త: దీపావళి బోనస్ రూ.400 కోట్లు!
మరోవైపు, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మాత్రం ‘మేము స్థానికులం’ అనే నినాదంతో ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. ఆయన ప్రచారం చాలా జోరుగా సాగుతోంది. బీఆర్‌ఎస్ మాత్రం ఈ విషయంలో ఎలాంటి ఎదురుదాడి చేయకుండా, ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ముందస్తుగా ఆరోపణలు చేస్తోందని రాజకీయ పండితులు అంటున్నారు.
నవీన్ యాదవ్‌కు యువత మద్దతు
నవీన్ యాదవ్‌కు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. ఆయన చాలా ఏళ్లుగా పండుగలు, ఇతర కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో కలిసి ఉంటున్నారు. ఇటీవల నిర్వహించిన సామూహిక సీమంతాలు వంటి కార్యక్రమాలు మహిళా ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉంది.
నవీన్ యాదవ్ చదువుకున్న యువకుడు కావడం వలన యువతలో ఆయనకు మంచి అభిమానులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయనను బీసీ అభ్యర్థిగా ఎంపిక చేయడం, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామనే నిర్ణయం కాంగ్రెస్‌కు కలిసి వస్తుంది. జూబ్లీహిల్స్‌లో దాదాపు 1.40 లక్షలు బీసీ ఓట్లు, దాదాపు లక్ష మైనార్టీ ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ కాంగ్రెస్ విజయానికి దోహదపడే అంశాలుగా కనిపిస్తున్నాయి.