National ST Commission: టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండపై కేసు విచారణపై సైబరాబాద్ పోలీసులపై జాతీయ ఎస్టీ కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. కేసు విచారణకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ రాకపోవడాన్ని తప్పుబట్టింది. మరోసారి ఇలాగే జరిగితే ఏకంగా డీజీపీనే రప్పించాల్సి వస్తుందని హెచ్చరించింది. కమిషనర్ బదులు ఏసీపీ రావడంపై అసహనం వ్యక్తంచేసింది.
National ST Commission: గత ఏప్రిల్ 26వ తేదీన రెట్రో సినిమా వేడుకలో గిరిజనుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నటుడు విజయ్ దేవరకొండపై హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదే అంశంపై జాతీయ ఎస్టీ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేయడంతో కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ విచారణ చేపట్టారు.
National ST Commission: ఈ నేపథ్యంలో జాతీయ ఎస్టీ కమిషన్ విచారణ హాజరు కావాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు నోటీసులు పంపారు. ఈ మేరకు మాదాపూర్ ఏసీపీ హాజరయ్యారు. దీంతో కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ అసహనం వ్యక్తంచేశారు. కమిషనర్‌కు నోటీసులు ఇస్తే మీరెందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. ఆ మాత్రం తెలియదా? అని నిలదీసింది. మరో 13 రోజుల్లో హైదరాబాద్ కమిషన్ హాజరు కాకపోతే, డీజీపీని విచారణకు రప్పించాల్సి ఉంటుందని ఏసీపీని జాతీయ ఎస్టీ కమిషన్ హెచ్చరించింది.