Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజులపాటు ఒడిశాలో పర్యటించనున్నారు. భువనేశ్వర్ చేరుకున్న ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఉప ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించిందన్నారు.మొదట ఒడిశాలో, ఆ తర్వాత హర్యానాలో, ఆ తర్వాత మహారాష్ట్రలో బీజేపీ గెలిచిందని ప్రధాని అన్నారు. ఇదీ బీజేపీ ప్రత్యేకత, బీజేపీ కార్యకర్తల బలం అని చెప్పారు.
ఇది కూడా చదవండి: Manipur: మణిపూర్ లో తెరుచుకున్న స్కూల్స్..
Narendra Modi: ఒక ప్రధాని 3 రోజుల పాటు రాష్ట్రంలో ఉండడం ఇదే తొలిసారి. నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో భువనేశ్వర్‌లోని లోక్ సేవా భవన్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న డీజీపీ-ఐజీ సదస్సుకు ప్రధాని మోదీ హాజరవుతారు.
ఈ సదస్సును హోంమంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు, రాష్ట్రాల డీజీపీలు, సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ చీఫ్, స్పెషల్ ప్రొటెక్షన్ గార్డ్ ఇందులో పాల్గొంటున్నారు.