Narayana: అమరావతిని రాజధానిగా నిర్మించే ప్రక్రియ వేగంగా సాగుతోందని, దాని గురించి వస్తున్న దుష్ప్రచారాలను నమ్మొద్దని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు.
మంత్రి మాట్లాడుతూ, “అమరావతి రాజధానిగా చాలా సురక్షితమైన ప్రదేశం. నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మార్చి 31లోపు అధికారుల కోసం నివాసాలను సిద్ధం చేసి అప్పగిస్తాం” అని చెప్పారు.
అదేవిధంగా, రోడ్డు పనులు కూడా ప్రాధాన్యతతో జరుగుతున్నాయని, “ఇంకా ఏడాదిన్నరలో రోడ్డు పనులు పూర్తవుతాయి” అని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణంపై వ్యాప్తి చేస్తున్న వదంతులను ప్రజలు నమ్మరాదని ఆయన పిలుపునిచ్చారు.