Nara Rohit: అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సిరీస్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రాలు మాస్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అల్లు అర్జున్ తన శక్తిమంతమైన నటనతో అభిమానులను మెప్పించారు. అయితే, ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం నారా రోహిత్‌ను సంప్రదించినట్లు సమాచారం. ‘పుష్ప’లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర కోసం చిత్ర బృందం ఆయనను కలిసినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆయన ఈ అవకాశాన్ని వదులుకున్నారు. ఆ తర్వాత ఈ పాత్ర మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్‌కు దక్కగా, ఆయన అద్భుత నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ విషయాన్ని నారా రోహిత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇలా బ్లాక్‌బస్టర్ చిత్రంలో అవకాశం కోల్పోవడంతో నారా రోహిత్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. అయితే, ఆయన తాజా చిత్రం ‘భైరవం’లో నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
