Bellamkonda Sai Sreenivas

Bellamkonda Sai Sreenivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ‘భైరవం’తో సరికొత్త అధ్యాయం!

Bellamkonda Sai Sreenivas: మాస్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ‘భైరవం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రూటెడ్‌ కథాంశంతో, సరికొత్త లుక్‌లో ఈ యంగ్‌ హీరో ఈసారి భిన్నమైన పాత్రలో ఆకట్టుకోనున్నాడు. డ్యాన్స్‌, యాక్షన్‌ సన్నివేశాల్లో తనదైన శైలిని చూపిస్తూ, ఎమోషనల్‌ పాత్రలోనూ మెరిసేందుకు సిద్ధమయ్యాడు. ‘భైరవం’ టీజర్‌, ట్రైలర్‌, పాటలు ఇప్పటికే అభిమానుల్లో హైప్‌ పెంచాయి.

రెండున్నర సంవత్సరాల విరామం తర్వాత వస్తున్న ఈ చిత్రంలో సాయి శ్రీనివాస్‌ సరికొత్త రూపంలో కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఆయన చేసిన కఠోర శ్రమ సినిమా యూనిట్‌ను కూడా ఆకట్టుకుంది. సెన్సార్‌ రిపోర్ట్స్‌ ప్రకారం, ఈ చిత్రం ఆయన కెరీర్‌లో సూపర్‌ హిట్‌గా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ సినిమా ఆయనకు స్టార్‌ హీరో స్థాయిని తీసుకొస్తుందని యూనిట్‌ ధీమాగా ఉంది.

ప్రస్తుతం ‘భైరవం’ ప్రమోషన్స్‌లో నిమగ్నమైన సాయి శ్రీనివాస్‌, యూనిట్‌తో కలిసి అగ్రెసివ్‌గా ప్రచారం చేస్తున్నాడు. ఈ చిత్రం ఆయన కెరీర్‌లో గేమ్‌ ఛేంజర్‌ అవుతుందా? అది ఈ నెల 30న తేలనుంది!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mohanlal: బరోజ్' మూవీ విజయంపై మోహన్ లాల్ ధీమా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *