Allu Arjun: టాలీవుడ్ స్టార్ హీరోల మధ్య ఉండే స్నేహం, ఒకరిపై ఒకరు చూపించుకునే అభిమానం ప్రేక్షకులకు ఎప్పుడూ ముచ్చటేస్తుంది. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకరినొకరు ఎంతో ఆప్యాయంగా ‘బావ’ అని పిలుచుకునే ఈ ఇద్దరు స్టార్స్.. సోషల్ మీడియాలో కూడా అదే స్నేహాన్ని చూపిస్తుంటారు. తాజాగా ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని బన్నీ పెట్టిన ఒక స్పెషల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
మెగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త సినిమా ‘డ్రాగన్’ (Dragon) అఫీషియల్ గ్లింప్స్ నిన్న విడుదలై యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ గ్లింప్స్ చూసిన అల్లు అర్జున్.. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తారక్‌కు సరికొత్త స్టైల్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సినిమా టైటిల్‌ను వాడుతూ బన్నీ చేసిన ట్వీట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
“ఈసారి టైగర్ కాదు.. డ్రాగన్.. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బావ. ఈ పుట్టినరోజు నీ జీవితంలో అపారమైన శాంతి, సంతోషం, ప్రేమని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ అల్లు అర్జున్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ను అందరూ ‘యంగ్ టైగర్’ అని పిలుస్తారు కాబట్టి, దానికి కనెక్ట్ చేస్తూ ‘ఈసారి డ్రాగన్’ అంటూ బన్నీ భిన్నంగా విషెస్ చెప్పడం విశేషం.
ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇద్దరు టాప్ హీరోల మధ్య ఉన్న ఈ లవ్ అండ్ రెస్పెక్ట్ చూసి నందమూరి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇండస్ట్రీలో ఇలాంటి హెల్తీ వాతావరణం ఉండటం చాలా ఆనందంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Many happy returns of the day Bava @tarak9999 ! May you have abundant prosperity, peace & love .
This time it ain’t tiger
It’s DRAGON 🐉
Roaring fire every shot 🔥— Allu Arjun (@alluarjun) May 20, 2026
