Mamitha Baiju: ప్రేమలు’ సినిమాతో తెలుగులో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న మమితా బైజు.. ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ చూస్తే ఒక విషయం మాత్రం తెలుస్తుంది, ఆమె యాక్టింగ్ ఇంకా క్యారెక్టర్ డెప్త్ ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చారు. ఇదేదో అనుకోకుండా జరిగిందని అనుకుంటే పొరపాటు పడినట్టే.
పక్కా ప్లాన్‌తో, ఒక క్లారిటీతో ఆమె సినిమాలను ఎంచుకుంటున్నారు. ఈ విషయం గురించి ఆమె చెబుతూ.. కెరీర్‌లో మంచి క్యారెక్టర్‌లను మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నాను, గ్లామర్ రోల్స్‌కి దూరంగా ఉంటాను అని చెప్పారు. మంచి సినిమాలు చేసి తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోవడానికి ఆమె ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.
కొన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నేను చేసిన మంచి సినిమాలు, అవి చూస్తున్నప్పుడు నాకే తెలియకుండా వచ్చే ఆనందం ఇంకా తృప్తి కలగాలి, దానికోసమే వచ్చిన ప్రతి సినిమాని ఒప్పుకోకుండా అందులో బెస్ట్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు.
తాజాగా ధనుష్‌తో నటించిన ‘కార’ సినిమాతో హిట్ కొట్టిన ఆమె, కొన్ని నెలల్లో ఇంకో మూడు సినిమాలతో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నారు. దళపతి విజయ్‌తో నటించిన ‘జననాయకన్’ (తెలుగులో ‘జన నాయకుడు’), అలాగే సూర్యతో చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, విష్ణు విశాల్‌తో చేసిన ‘ఇరండు విధానం’.. ఈ లైన్ అప్ చూసుకుంటే ఆమె చెప్పిన ప్రతి మాట నిజంగానే కనిపిస్తుంది. ఒక సినిమాకి ఇంకో సినిమాకి సంబంధం లేకుండా ఉన్నాయి. ఈ మూడు సినిమాలకు బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ వస్తే సౌత్ ఇండస్ట్రీ టాప్ హీరోయిన్స్ జాబితాలోకి మమితా చేరడం ఖాయం.
