Nara Lokesh: గూగుల్ క్లౌడ్ ఎండీ బిక్రమ్ సింగ్, కంట్రీ డైరెక్టర్ (పబ్లిక్ సెక్టార్ అండ్ ఎడ్ టెక్) ఆశిష్, వారి బృందాన్ని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ డిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఏర్పాటు చేయబోయే డేటా సిటికి సంబంధించి చర్చించారు.
ప్రభుత్వం తరపున ఇవ్వాల్సిన అనుమతులు, భూ కేటాయింపులు, పాలసీని త్వరితగతిన ఇస్తామని, ఇందుకోసం ఎపి ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు చురుగ్గా పనిచేస్తోందని చెప్పారు.
ఇది కూడా చదవండి: India Government: డీప్‌సీక్ AI – ChatGPT లను ఉపయోగించవద్దంటున్న ప్రభుత్వం . . ఎందుకంటే . .
డేటా సిటీ ఏర్పాటును కంపెనీ తరపున వేగవంతం చేయాలని, దీనివల్ల విశాఖ ఐటి ముఖచిత్రం మారుతుందని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎఐలో ప్రపంచ స్థాయి అప్లికేషన్‌లను రూపొందించడానికి, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ ఏర్పాటుకు గూగుల్ డాటా సిటీ గేమ్ ఛేంజర్ కానుందని అన్నారు.
డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ కు ఎపి ప్రభుత్వం చేస్తున్న కృషిని గూగుల్ క్లౌడ్ ఎండీ బిక్రమ్ సింగ్ ఈ సందర్భంగా కొనియాడారు. డాటా సిటీ పనుల వేగవంతానికి అవసరమైన అన్ని చర్యలు చేపడతామని చెప్పారు.

