IND vs ENG: ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా భారత జట్టు సొంత దేశంలో ఇంగ్లాండ్ తో 3 వన్డేలు ఆడునుంది. ఆ సిరీస్ రేపు మొదలుకానుంది. నాగ్ పూర్ జరగబోయే మొదటి వన్డే తో మొదలు పెట్టి రాబోయే ఐసీసీ ట్రోఫీకి సంబంధించిన తమ జట్టు కాంబినేషన్స్, ప్లాన్స్, ప్రయత్నాలు మరియు ఆట తీరుపై భారత్ విశ్లేషించుకోవడానికి ఇది ఒక మంచి సిరీస్ గా చెప్పవచ్చు. అయితే ఈ సిరీస్ కొద్ది మంది ప్లేయర్లకు మాత్రం పరీక్షగా నిలవబోతోంది.
ఇంగ్లాండ్ తో రేపు మొదలు కాబోయే వన్డే సిరీస్ భారత్ కు కీలకంగా మారింది. ముఖ్యంగా పేలవ ఫామ్ కనబరుస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ మరియు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎట్టి పరిస్థితుల్లోనూ సత్తా చాటాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఎలాంటి ముందడుగు వేయాలన్నా… ఈ ఇద్దరు సీనియర్ ప్లేయర్లు కచ్చితంగా రాణించాల్సిన అవసరం ఏర్పడింది. పైగా స్టార్ పేసర్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండే ఆశలు రోజురోజుకు సన్నగిల్లుతున్నాయి.
ముఖ్యంగా గత వన్డే ప్రపంచ కప్ లో రికార్డు స్థాయిలో అత్యధిక పరుగులు మరియు సెంచరీలు సాధించిన విరాట్ కోహ్లీ మరొకసారి తాను వైట్ ఫార్మాట్ లో కింగ్ అని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. రోహిత్ శర్మ మాత్రం తన దూకుడైన ఆటతీరుతో జట్టుకి మంచి ఆరంభాలు ఇవ్వడం కీలకం. పైగా దుబాయ్ పిచ్ లు స్పిన్ కు బాగా అనుకూలిస్తాయి. అక్కడ భారీ స్కోర్లు నమోదు కావు. కాబట్టి పవర్ ప్లే లో అత్యంత దూకుడైన ఆరంభం ఎంతో అవసరం.
IND vs ENG: ఇకపోతే కీపర్ రిషబ్ పంత్ కూడా అవకాశం లభిస్తే తాను వన్డే ఫార్మాట్ కు సరైన ఎంపిక అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కేఎల్ రాహుల్ స్థానంపై ఎలాంటి అనుమానాలు లేవు. అతను వీలు దొరికినప్పుడల్లా తన సత్తా నిరూపించుకుంటున్నాడు. కానీ పంత్ మాత్రం టెస్టుల మినహాయించి మిగిలిన ఫార్మాట్లలో పెద్దగా రాణించలేదు. హార్దిక్ పాండ్యా కూడా జట్టులో కీలక సభ్యుడు అతనికి స్థానానికి కూడా డోకా లేదు.
ఇది కూడా చదవండి: Maha Kumbh 2025: మహాకుంభమేళాలో స్నానం చేసిన ప్రధాని మోదీ..
అయితే భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాలని అనుకుంటే రిషబ్ పంత్ ను పక్కన పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కుల్దీప్ యాదవ్ తో పాటు జడేజా, అక్షర్ పటేల్ ఆల్రౌండర్ల జాబితాలో జట్టులో చోటు సంపాదించవచ్చు. అప్పుడు బ్యాటింగ్ మరింత బలోపేతం అవుతుంది. మహమ్మద్ షమ్మీ కూడా తన ఫిట్నెస్ నిరూపించుకోవడానికి ఈ సిరీస్ కీలకం. హర్షిత్ రానా మరియు వరుణ్ చక్రవర్తి లకు ఎలాంటి అవకాశం లభించిన వారు సత్తా చాటితే నేరుగా జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీలాడబోయే జట్టు కాంబినేషన్లు ఈ సిరీస్ పైనే అధికంగా ఆధారపడి ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.