Nara lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాజా రాజకీయ పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.లోకేష్ మాట్లాడుతూ – “కేటీఆర్‌ను కలుస్తా.. ఎందుకు కలవకూడదు? వివిధ సందర్భాల్లో మేము కేటీఆర్‌ను కలిశాం. కేటీఆర్‌ను కలవాలంటే రేవంత్‌రెడ్డిని అడగాలా?” అంటూ ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలుగా మారాయి.
అలాగే కవితను టీడీపీలో చేర్చుకోవడం గురించి అడిగిన ప్రశ్నకు లోకేష్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. “కవితను టీడీపీలో చేర్చుకోవడం అంటే జగన్‌ను పార్టీలో చేర్చుకున్నట్టే. అలాంటి అవకాశం అసలు లేదు” అని వ్యాఖ్యానించారు.
👉 ఈ వ్యాఖ్యలతో లోకేష్, కేటీఆర్‌తో తన సంబంధాలపై క్లారిటీ ఇవ్వడమే కాకుండా, కవిత భవిష్యత్తు రాజకీయాలపై గట్టి సందేశం పంపినట్టయ్యింది.