Nara Lokesh

Nara Lokesh: వైసీపీ నాయకులకు మహిళలంటే ఇంత ద్వేషభావమా?

Nara Lokesh: కొవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన మాటలు దారుణమని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు.

ఈ విషయం పై మంత్రి లోకేష్ గట్టి హెచ్చరిక చేశారు.

‘‘వైసీపీ నేతలకు మహిళలంటే ఇంత ద్వేషమా? పెద్ద చదువులు చదివితే సరిపోదు, కనీస ఇంగితజ్ఞానం కూడా ఉండాలి. మహిళలను కించపరిచేలా మాట్లాడటం నేరం. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా తప్పు. వైసీపీ నేతలు తమ అధినేత జగన్‌ను ఎలా ఉంటే అలా అనుసరిస్తున్నారు. తల్లిని, చెల్లిని తరిమేసిన జగన్‌ను ఆదర్శంగా తీసుకోవడమే ఇప్పుడు చూస్తున్నాం. మహిళలపై అసభ్యంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవు. ఇది జగన్‌ జంగిల్‌ రాజ్‌ కాదు, ప్రజల ప్రభుత్వం. మహిళలకు పూర్తిగా అండగా ఉంటాం’’ అంటూ లోకేష్ స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఈ అంశం రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. సోషల్ మీడియా, మీడియాలో ఈ ఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది. పార్టీలకు సంబంధం లేకుండా అన్ని వర్గాల మహిళలు ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Chandrababu: ఆ 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *