Nara Lokesh: మహా టీవీ చైర్మన్ మారెళ్ల వంశీకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి నారా లోకేశ్ గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ గారు ట్వీట్ లో “వంశీకృష్ణ గారు పుట్టినరోజు నాడు చేపట్టిన సేవా కార్యక్రమం అందరికీ ప్రేరణ కలిగించేదిగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన ‘జీరో పావర్టీ మిషన్ – పీ4’ లో భాగంగా నిరుపేద గిరిజన కుటుంబాలు – చెంచులైన నాలుగు కుటుంబాలను దత్తత తీసుకోవడం అభినందనీయం” అని కొనియాడారు.
ఇది కూడా చదవండి: PCB: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
అలాగే, “వంశీకృష్ణ గారి వంటి వారు ముందుకు వచ్చి ఈ మిషన్‌ను విజయవంతం చేయడానికి తోడ్పడటం గొప్ప విషయం. తన పుట్టినరోజును సేవా దినంగా మార్చుకుని, ఆ కుటుంబాలకు ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్న వంశీకృష్ణ గారు నిజంగా అనుసరించదగ్గ నేత” అని మంత్రి పేర్కొన్నారు.
అంతేకాకుండా, “ఇలాంటి మంచి పనులు మరింత మందిని ప్రభావితం చేసి, పీ4 మిషన్ లో భాగంగా బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడానికి మరెందరో ముందుకు రావాలని పిలుపునిస్తున్నాను” అని నారాలోకేశ్ అన్నారు.
వంశీకృష్ణ గారు సేవా కార్యక్రమాల పట్ల చూపిస్తున్న అంకితభావం యువతకు మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు.
మహా టీవీ చైర్మన్ మారెళ్ల వంశీకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.. జన్మదినం సందర్భంగా సీఎం చంద్రబాబు గారు జీరో పావర్టీ మిషన్ పీ4లో భాగం అయి, నిరుపేదలైన 4 గిరిజన (చెంచు) కుటుంబాలను దత్తత తీసుకోవడం అభినందనీయం. ఈ కుటుంబాలకు అన్నివిధాలా అండ… pic.twitter.com/Oc3PKfnvzw
— Lokesh Nara (@naralokesh) August 2, 2025

