Nara lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ ముఖ్య మంత్రులతో కీలకంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన కొందరు ఎమ్మెల్యేల ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కూన రవి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, నజీర్ అహ్మద్, దగ్గుపాటి ప్రసాద్ తీరును ప్రత్యేకంగా ప్రస్తావించారు.
లోకేష్ మాట్లాడుతూ ఏడుగురు ఎమ్మెల్యేల వ్యవహారశైలి సరికాదని వ్యాఖ్యానించారు. ఈ విషయం మీద పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా సీరియస్‌గా ఉన్నారని ఆయన గుర్తుచేశారు.
పెరోల్ అంశంపై ఆచితూచి వ్యవహరించాలని మంత్రులకు సూచించారు. అలాగే దివ్యాంగుల పెన్షన్ల తొలగింపు విషయంపై వచ్చిన ఫిర్యాదులను మంత్రులు నారాలోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఆయన అర్హులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మొత్తంగా, ఎమ్మెల్యేల తీరుపై కఠిన వైఖరి అవలంబిస్తున్న సంకేతాలు ఇచ్చిన నారాలోకేష్, పరిపాలనా వ్యవహారాల్లో మరింత క్రమశిక్షణ అవసరమని స్పష్టం చేశారు.