Nara lokesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న నేపథ్యంలో, మంత్రి నారా లోకేష్ స్పందించారు.
“ప్రతి ఉచిత బస్సు టికెట్ అనేది నమ్మకానికి నిదర్శనం. అది కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు, స్వేచ్ఛకు, గౌరవానికి ప్రతీక. ఇది ఒక కదలిక.. మహిళలకు స్వేచ్ఛాయుత, సమాన అవకాశాల దిశగా ముందడుగు” అని ఆయన పేర్కొన్నారు.
మహిళల సాధికారితకు ఈ పథకం పట్టంకడుతుందన్నారు. “ఈ ప్రయాణాన్ని ఒక వేడుకలా జరుపుకుందాం. మీ ఉచిత బస్సు టికెట్‌తో సెల్ఫీ తీసుకుని ప్రపంచానికి సాధికారిత అంటే ఏమిటో చూపించండి” అని లోకేష్ పిలుపునిచ్చారు.