Nara-lokesh: ఏపీ మంత్రి నారా లోకేశ్, వైసీపీ చేపట్టిన యువత పోరు కార్యక్రమంపై సెటైర్లు వేశారు. మొదట దీనికి ఫీజు పోరు అని పేరు పెట్టి, ఆ తర్వాత యువత పోరుగా మార్చడంపై ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అసలు వారు దేనికోసం పోరాడుతున్నారో కూడా స్పష్టత లేదని విమర్శించారు.
గతంలో వైసీపీ ప్రభుత్వం రూ. 4,500 కోట్ల విద్యార్థుల ఫీజులను బకాయి పెట్టిందని, ఇప్పుడు అదే పార్టీ ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అంతేకాదు, వైసీపీ హయాంలోనే విద్యుత్ చార్జీలను పెంచి, ఇప్పుడు మళ్లీ ధర్నా చేయడం హాస్యాస్పదమన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చకు సిద్ధమా? అని వైసీపీకి సవాల్ విసిరిన నారా లోకేశ్, తమ పార్టీ ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యోగాలు, ఉపాధి కల్పన వంటి అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. శాసనమండలిలో మాట్లాడుతున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.