Gas cylinder Explosion: ఈ ఉదయం చాపిరేవులో విషాదం నెలకొంది. ఒక ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు కారణంగా ఇల్లు కూలిపోయింది. ఈ సంఘటనలో ఇద్దరు మరణించారు. పది మందికి పైగా గాయపడినట్లు సమాచారం.
మంగళవారం ఉదయం చాపిరేవులలోని ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ప్రమాదం యొక్క ప్రభావంతో సమీపంలోని నివాసాలు దెబ్బతిన్నాయి. స్థానికులు సంఘటనా స్థలం నుండి రెండు మృతదేహాలను వెలికితీశారు. వారిని వెంకటమ్మ (35) ,దినేష్ (10) గా గుర్తించారు. మృతుల సంఖ్యపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ప్రమాద ధాటికి చుట్టుపక్కల నివాసాల్లోని పది మందికి పైగా గాయాలైనట్లు సమాచారం.వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. గ్యాస్ స్టవ్ వెలిగించి ఉండటం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.