Nagarjuna Sagar Dam: కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతున్నది. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండుకుండలా ఉన్నాయి. వాటి కింద ఉన్న జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం మేరకు నిండిపోయాయి. ఇక కింద ఉన్న నాగార్జున సాగర్ రిజర్వాయర్‌కు వరద ప్రవాహం ఉరకలు పెడుతున్నది.
Nagarjuna Sagar Dam: ఈ మేరకు నాగార్జున సాగర్ రిజర్వాయర్‌కు ఎగువ నుంచి 1.20 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 580 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి విలువ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటినిల్వ సామర్థ్యం 280.98 టీఎంసీలకు చేరుకున్నది.
Nagarjuna Sagar Dam: మరో 10 అడుగులు, 32 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరితో నిండుకుండలా మారనున్నది. దీంతో రెండు రోజుల్లో క్రస్టు గేట్లు ఓపెన్ చేయనున్నారు. ఇప్పటికే కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తికి దిగువకు నీటిని వదులుతున్నారు.