Naga Chaitanya Marriage Date: అక్కినేని జాతీయ అవార్డుల వేడుకలో నాగచైతన్య కాబోయే భార్య శోభితా ధూళిపాళ్ల కూడా మెరిశారు. గ్రూప్ ఫోటోస్ కోసం ఆమె కూడా వేదిక ఎక్కారు. ఆగస్ట్ 8న వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఇటీవలే తన ఇంటిలో పసుపు కొట్టడంతో పెళ్ళి పనులు మొదలయ్యాయంటూ శోభిత కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే వీరి పెళ్ళి డిసెంబర్ 4న జరుగబోతోందని తెలుస్తోంది. అది ఎక్కడ జరుగుతుందనే విషయం మాత్రం ఇంతవరకూ బయటకు రాలేదు. మరి వీరి నిశ్చితార్థం గురించి అప్పట్లో సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన నాగార్జునే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి.
