Mulugu:

Mulugu: వాజేడు ఎస్ఐ ఆత్మ‌హ‌త్య వెనుకున్న ఆ యువ‌తి ఎవ‌రు?

Mulugu:ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ హ‌రీశ్ ఆత్మ‌హ‌త్య వెనుక సంచ‌ల‌న‌ విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. కొత్త కోణం వెలుగులోకి రావ‌డంతో మిగ‌తా విష‌యాలు కావ‌ని తేలిపోయింది. అధికారులు, విధుల ఒత్తిడి కార‌ణం కావ‌చ్చ‌ని కొంద‌రు అనుమానించారు. అదే మండ‌లంలో ఇటీవ‌ల ఇన్‌ఫార్మ‌ర్ నెపంతో ఇద్ద‌రి హ‌త్య‌, ఆయ‌న ఆత్మ‌హ‌త్య‌కు ముందే ఏటూరునాగారం ఎన్‌కౌంట‌ర్ జ‌ర‌గడం.. వీటి ఒత్తిళ్ల‌తోనే ఎస్ఐ త‌నువు చాలించాడ‌ని మ‌రికొంద‌రు భావించారు. కానీ ఇవ‌న్నీ కాద‌ని ఓ యువ‌తి హ‌నీట్రాప్‌ కార‌ణంగానే ఆయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింద‌ని తెలిసింది.

Mulugu:ఎస్ఐ రుద్రార‌పు హ‌రీశ్‌ పూనూరు గోదావ‌రి బ్రిడ్జి స‌మీపంలోని ఓ రిసార్ట్స్‌లో త‌న స‌ర్వీస్ రివాల్వ‌ర్‌తో కాల్చుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. డిసెంబ‌ర్ 1న రాత్రి ఒంటరిగా వెళ్లిన ఎస్ఐ సోమ‌వారం ఉద‌యం అయినా రాక‌పోయేస‌రికి వెంట‌నే స్టేష‌న్ సిబ్బంది వెళ్లి చూడ‌గా, విగ‌త‌జీవిగా ప‌డి ఉన్నాడు. అయితే ఎన్‌కౌంట‌ర్‌, ఇన్‌ఫార్మ‌ర్ హ‌త్య‌ల అనుమానాల‌ను ప‌టాపంచలు చేస్తూ ఆయ‌న వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనే త‌నువు చాలించాడ‌ని అస‌లు కోణం వెలుగులోకి వ‌చ్చింది.

Mulugu:హ‌నీట్రాప్‌లో ప‌డే ఎస్ఐ హ‌రీశ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని స‌మాచారం. సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ యువ‌తి హ‌రీశ్‌తో కొంత‌కాలంగా ప్రేమలో ఉన్న‌ద‌ని తెలిసింది. అయితే ఆ యువ‌తి డ‌బ్బు, ప‌లుకుబ‌డి ఉన్న‌వారిని లొంగ‌దీసుకుంటుంద‌ని, ఇదే క్ర‌మంలో ఎస్ఐ హ‌రీశ్‌ను కూడా ప్రేమ‌లోకి దించింద‌ని స‌మాచారం. అయితే అదే యువ‌తి గ‌తంలో ముగ్గురు యువ‌కుల‌ను ప్రేమ పేరుతో మోసం చేసింద‌ని, ఆ ముగ్గురిపై కేసులు కూడా పెట్టిన‌ట్టు స‌మాచారం. ఇదే క్ర‌మంలో ఇక్క‌డా డ్రామాకు తెర‌లేపిన‌ట్టు తెలిసింది.

Mulugu:ఎస్ఐ హ‌రీశ్‌ది జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా కొత్త‌ప‌ల్లిగోరి మండ‌లం వెంక‌టేశ్వ‌ర్ల‌ప‌ల్లి స్వ‌గ్రామం. ఆ రాత్రి హ‌రీశ్ ఒక్క‌డే రిసార్ట్స్‌కు వెళ్ల‌లేద‌ని, ఆయ‌న‌తో పాటే ఆ యువ‌తి కూడా ఉన్న‌ద‌న్న‌ ఆధారాలు బ‌య‌ట‌కొచ్చాయి. హ‌రీశ్‌కు ఇటీవ‌లే వ‌రంగ‌ల్‌కు చెందిన ఓ యువ‌తితో వివాహ సంబంధం ఖాయంకాగా, ఈ నెల 14న నిశ్చితార్థం చేసేందుకు ముహూర్తం నిర్ణ‌యించారు. ఇంత‌లోనే ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డంతో వారిండ్ల‌లో విషాదం నెల‌కొన్న‌ది.

Mulugu:ప్రేమ పేరుతో వ‌ల‌ప‌న్నిన ఆ యువ‌తి హ‌రీశ్‌ను బెదిరింపుల‌కు దిగ‌డంతోనే ఆయ‌న త‌నువు చాలించి ఉండొచ్చ‌ని భావిస్తున్నారు. ఆ రాత్రి ఇద్ద‌రి న‌డుమ వివాదం నెల‌కొన్న‌ద‌ని తెలుస్తున్న‌ది. ఆ యువ‌తి ఒత్తిడితోనే ప‌రువు పోతుంద‌నే భ‌యాందోళ‌న‌తో త‌నువు చాలించి ఉంటాడ‌ని భావిస్తున్నారు. ఇద్ద‌రూ ఒకే గ‌దిలో ఉండ‌గానే, హ‌రీశ్ కాల్చుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ స‌మ‌యంలో ఆయువ‌తి ప‌క్క‌నే కుర్చీలో కూర్చొని ఉన్న వీడియో బ‌య‌ట‌కొచ్చింది. అన్నీ తెలిసిన‌, అంద‌రికీ చెప్పాల్సిన ఓ ఎస్ఐ హ‌నీట్రాప్‌లో చిక్కుకొని జీవితాన్నే వ‌దులుకోవ‌డం విషాద‌క‌రం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *