Movie Time

Movie Time: ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు!

Movie Time: ఒకే షాట్లో సినిమా మొత్తాన్ని తెరకెక్కించాడు నిర్మాత, దర్శకుడు, రచయిత, హీరో సూపర్ రాజా! ‘ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు’ దాని పేరు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా సూపర్ రాజా మాట్లాడుతూ, 17 నగరాల్లో 924 ప్రమోషనల్ ఈవెంట్ చేశామని, కరపత్రాలు ప్రింట్ చేయించి, జనాలకు పంచామని, ఈ తరహా ప్రమోషన్స్ గతంలో ఎప్పుడూ ప్రేక్షకులు చూసి ఉండరని అన్నారు.

ఇది కూడా చదవండి: Matcha Boba Tea Benefits: Matcha Boba Tea గురించి మీకు తెలుసా ? దీని స్పెషాలిటీస్ తెలిస్తే వావ్ అంటారు !

Movie Time: దాదాపు 100 నిమిషాల నిడివి ఉండే ఈ ప్రయోత్మక సింగిల్ షాట్ మూవీలో తాను కీలక పాత్రను పోషించానని థియేటర్ ఆర్టిస్ట్ వంశీ గోనె అన్నారు. ఈ చిత్రంలో తాను సాయిపల్లవి అనే పాత్రను చేశానని, సూపర్ రాజా ఎంతో కష్టపడి ఈ సినిమా చేశారని హీరోయిన్ చందన తెలిపింది. ఇందులో తాను కళామతల్లి పాత్ర చేశానని రమ్య ప్రియ అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో కుటుంబ సభ్యులు సైతం పాల్గొని అతన్ని ప్రోత్సహించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి నెలలో విడదల చేయబోతున్నారు. ఈ సినిమాకు సిద్ధార్థ్‌ శివదాసని, సబు వర్గీస్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Viral News: ఏంటి.. పొద్దున్నే కోడి కూస్తుంది అని కంప్లైంట్ ఇచ్చాడా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *