The Paradise: హిట్ 3 తర్వాత హీరో నాని నటిస్తున్న సినిమా ‘ది ప్యారడైజ్’ ఈ సినిమాకి శ్రీకాంత్ ఓడెల్ డైరెక్షన్ చేస్తున్నాడు. దసరా తర్వాత వీల ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇపుడు ఈ సినిమా నుండి ఓ అప్డేట్ వచ్చింది.
సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ విషయాని స్వయంగా మంచు లక్ష్మి చెప్పారు. తాజాగా అయితే తాజాగా సినిమా యూనిట్ ఆఫీసియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ లుక్ చుసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
ఇది కూడా చదవండి: Komatireddy Raj Gopal Reddy: వాడి తగ్గని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి.. సర్కార్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు
పోస్టర్ విషయానికి వస్తే.. మోహన్ బాబు కుర్చీలో కూర్చొని ఉంటాడు.. ఇందులో ఏముంది అనుకుంటేపప్పులో కాలేసినట్లే, షర్ట్ లేకుండా తన వెనుకాల గన్స్ చేతి కింద స్వోర్డ్ చేతులకి రక్తం, వేళ్ళ మధ్యలో సిగార్, స్పెట్స్ పెట్టుకొని ఒక్క ఇంట్రెస్టింగ్ లుక్ తో ఉంటుంది ఈ పోస్టర్. ఇందులో మోహన్ బాబు విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు లేక కథను మలుపు తిప్పే పాత్రన అనేది ఇంకా తెలియలిసి ఉంది.
ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఆయన ట్యూన్స్‌పై భారీగా హైప్ ఉంది. ఎస్‌ఎల్‌వి సినిమాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం, వచ్చే ఏడాది మార్చి 26న పాన్ వరల్డ్ లెవెల్‌లో విడుదల కాబోతోంది.
నాని కొత్త అవతారం, మోహన్ బాబు పవర్‌ఫుల్ ప్రెజెన్స్, అనిరుధ్ ఎనర్జీ – ఈ మూడూ కలిపి ‘ది ప్యారడైజ్’ను ఈ ఏడాది అత్యంత ఆసక్తికరమైన చిత్రంగా నిలిపాయి. సోషల్ మీడియాలో విడుదలైన పోస్టర్లకు ఇప్పటికే విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఫ్యాన్స్ మాటల్లో చెప్పాలంటే – “ది ప్యారడైజ్’ అంటే ఒక విజువల్ ఫీస్ట్ కాబోతోందని నమ్మకం కట్టిపడేస్తోంది.”
Collection King #MohanBabu garu as SHIKANJA MAALIK in #TheParadise
A Srikanth Odela Sambhavam 💥💥 pic.twitter.com/q15bIbId4Y
— s5news (@s5newsoffical) September 27, 2025