ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరో సారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 10, 11 తేదీల్లో ఆయన లావోస్‌లో పర్యటించనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భాగంగా రెండు రోజులు లావోస్‌లో మోదీ పర్యటించనున్నారు. 21వ ఆసియాన్ – ఇండియన్ సమ్మిట్, 19వ ఈస్ట్ ఏషియా సదస్సులో పాల్గొననున్నారు.
ఈ సమావేశాల్లో వివిధ దేశాలతో భారత్ భాగస్వామ్య ప్రాంతీయ ప్రాముఖ్యం కలిగిన అంశాలపై చర్చించే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జ భారత్ పర్యటనలో ఉన్నారు. ఆయన పర్యటన అనంతరం మోదీ విదేశీ పర్యటన ప్రారంభం అవుతుందని తెలిపారు.