Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తొలి నుంచి తనపట్ల ఆ పార్టీ, ప్రభుత్వ వైఖరిపై రగిలిపోతున్నారు. తాజాగా తన అనుచరుడి హత్యా ఘటనతో మరింతగా రెచ్చిపోయారు. పార్టీ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌తో తీవ్రస్వరంతో మాట్లాడిన ఆయన గురువారం ఏకంగా ఆ పార్టీ అధిష్ఠానానికే లేఖ రాయడం సంచలనంగా మారింది.
Jeevan Reddy: బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ హత్యా ఘటనపై స్పందించారు. తనది తొలి నుంచి కాంగ్రెస్ కుటుంబమేనని, కాంగ్రెస్‌లో చేరినా సభ్యత్వం స్వీకరించలేదని చెప్పారు. అనుచరుడి హత్యా ఘటనపై జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలను వ్యక్తం చేశారు. దీంతో ఆయన మరింతగా స్పందించి లేఖ రాసినట్టు తెలిసింది.
Jeevan Reddy: తీవ్ర ఆందోళన, మానసిక వ్యథ, బాధాతప్త హృదయంతో లేఖ రాస్తున్నానని జీవన్‌రెడ్డి ఆలేఖలో పేర్కొన్నారు. నా రాజకీయ భవిష్యత్‌ను మీరే నిర్దేశించండి.. నన్ను సంపుకుంటారా? సాదుకుంటారా? అని తీవ్రమైన పదాలతో ఆయన కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ప్రశ్నల వర్షం కురిపించారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ గత ఎన్నికలకు ముందు విడుదల చేసిన పాంచ్‌న్యాయ్ మ్యానిఫెస్టోలో ప్రజాప్రతినిధులు పార్టీ ఫిరాయింపులు చేస్తే వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాహుల్‌గాంధీ హామీని పక్కనబెట్టిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఘాటుగా విమర్శించారు.