MLA Raja Singh: బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అంశంపై బీజేపీ తీసుకునే వైఖరిపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లక్ష్యంగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ నుంచి గెంటేసినట్టే కొందరు నేతలకు అదే గతి పడుతుందని హెచ్చరించారు.
MLA Raja Singh: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఎన్ని ఓట్ల తేడాతో ఎడిపోతుందని జనాలు అడుగుతున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎద్దేవా చేశారు. ఎంఐఎం అధినేత ఒవైసీతో బీజేపీకి ఉన్న ఒప్పందం వల్లే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయడం లేదా? అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారా? మరో పార్టీని గెలిపిస్తున్నారా?
MLA Raja Singh: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కూడా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ టార్గెట్ చేశారు. ఈ ఉప ఎన్నికల్లో ఓడిపోతే పార్టీ అధిష్టానానికి ముఖం ఎలా చూపుతారని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి గెలిచిన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓడిపోతే మీరు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. తనను టార్గెట్ చేసి పార్టీ నుంచి గెంటేసినట్టే మీకు కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు.