Miss Universe 2025: థాయ్‌లాండ్‌లో జరిగిన మిస్ యూనివర్స్ 2025 పోటీలు ఈసారి ప్రపంచవ్యాప్తంగా భారీ ఆసక్తిని రేకెత్తించాయి. ఈ ప్రతిష్ఠాత్మక వేదికపై మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ మెరిసి అందాల కిరీటాన్ని తన పేరుమీద నమోదు చేసుకుంది. గత ఏడాది విజేత అయిన డెన్మార్క్ అందాల భామ విక్టోరియా కెజార్ హెల్విగ్ ప్రత్యేక కార్యక్రమంలో ఫాతిమాకు కిరీటాన్ని అందించారు.
వేదికపై తన నడక, ఆత్మవిశ్వాసం, ప్రశ్నల విభాగంలో చూపించిన తెలివితేటలు ఫాతిమా విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన సుందరీమణుల మధ్య గట్టి పోటీ నెలకొన్నా… ఆమె ప్రతిభ అందరికంటే ప్రత్యేకంగా కనిపించింది. తొలి రన్నరప్‌గా థాయ్‌లాండ్‌కు చెందిన ప్రవీనర్ సింగ్ నిలవగా, రెండో రన్నరప్ స్థానాన్ని వెనెజువెలా అందమైన స్టిఫానీ అబాసలీ తనదాగా చేసుకుంది.
Also Read: Droupadi Murmu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
భారత్ తరఫున ఈ సంవత్సరం రాజస్థాన్‌కు చెందిన మణికా విశ్వకర్మ పోటీలో పాల్గొన్నారు. ప్రారంభ రౌండ్లలో మంచి ప్రదర్శన చూపించిన మణికా, స్విమ్‌సూట్ రౌండ్‌తో టాప్ 30లోకి ప్రవేశించింది. అయితే టాప్ 12లో చోటు దక్కకపోవడంతో కిరీటం గెలుచుకునే అవకాశం కోల్పోయింది. ఈ కారణంగా ఈ ఏడాది భారత్ చేతికి విజయం అందలేదు. ఈ సారి మిస్ యూనివర్స్ వేదికపై మెక్సికో మళ్లీ గర్వించుకునే అవకాశం వచ్చింది. ఫాతిమా బాష్ అందంతో, వ్యక్తిత్వంతో, ధైర్యంతో ప్రపంచ అందాల కిరీటాన్ని తన దేశానికి తీసుకువచ్చింది.

