Seethakka: తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రి సీతక్క సూటిగా స్పందించారు. గోబెల్స్ ప్రచారం కేటీఆర్‌కు కొత్తకాదంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. “సిస్టర్ కవిత ఇచ్చిన స్ట్రోక్‌తో కేటీఆర్ చిన్న మెదడు చితికిపోయింది” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన ఆరోపణలు సమంజసంగా లేవని, ప్రతిపక్షంలో ఉండే ఓ నాయకుడికి ఇది తగదని సీతక్క పేర్కొన్నారు. “నిర్మాణాత్మక ప్రతిపక్షపాత్ర ఎలా ఉండాలో మర్చిపోయారు కేటీఆర్,” అని పేర్కొన్నారు.
కవిత చెప్పిన ‘దెయ్యం’ కేటీఆరేనా?
కేటీఆర్‌ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. “కవిత చెప్పిన దెయ్యం కేటీఆరే కావొచ్చు. అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్‌ను మించినవారే” అంటూ విరుచుకుపడ్డారు. “బీఆర్ఎస్ దోచిన డబ్బు గులాబీ కూలీలుగా ప్రజల మీద బరువు పెడుతోంది” అని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: TG POLYCET Results 2025: విద్యార్థులకు అలర్ట్.. పాలిసెట్ ఫలితాలు విడుదల
కాళేశ్వరం.. కమీషన్ల భయాల నేపథ్యం
కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన సీతక్క.. “కమీషన్లు తీసుకున్నప్పుడు లేని భయం, ఇప్పుడు ఎందుకు?” అని నిలదీశారు. “ఈనాడు పత్రికపై కాంగ్రెస్ బాంబులు వేసిందన్నట్టు మాట్లాడటం అబద్ధాల పునాదే. ఇది ప్రజలను తప్పుదారి పట్టించడమే” అంటూ స్పష్టం చేశారు.
రాహుల్ పై మాట్లాడే స్థాయి లేదన్న విమర్శలు
రాహుల్ గాంధీపై కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు ఆవేదన కలిగిస్తున్నాయని మంత్రి అన్నారు. “ఆయన స్థాయికి కేటీఆర్ ఏమాత్రం సరిసమానుడు కాదు. తప్పుడు ఆరోపణలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయొద్దు” అని హెచ్చరించారు.