Dilip Vengsarkar

Dilip Vengsarkar: భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ కు అరుదైన గౌరవం

Dilip Vengsarkar: క్రికెట్ దిగ్గజం, భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ లైఫ్-సైజ్ (నిజ పరిమాణం) విగ్రహాన్ని ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేయాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) నిర్ణయించింది. ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత క్రికెట్‌కు మరియు ముంబై క్రికెట్‌కు వెంగ్‌సర్కార్ చేసిన అద్భుతమైన సేవలకు గుర్తింపుగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. MCA అధ్యక్షుడు అజింక్య నాయక్ మాట్లాడుతూ… వాంఖడేలో దిలీప్ వెంగ్‌సర్కార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ముంబై గొప్ప క్రికెట్ దిగ్గజాలలో ఒకరికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కాగా వెంగ్‌సర్కార్ 116 టెస్టులు, 129 వన్డేలలో ఇండియా తరుపున ప్రాతినిధ్యం వహించారు. 1983లో భారత్ ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు.

ఇది కూడా చదవండి: SSMB29: Gen 63 కాదు.. మహేష్ రాజమౌళి సినిమాకు కొత్త టైటిల్ ఫిక్స్.. !

లార్డ్స్‌లో వరుసగా మూడు సెంచరీలు చేసిన ఏకైక విదేశీ బ్యాట్స్‌మెన్ గా ఆయనకు లార్డ్ ఆఫ్ లార్డ్స్ అనే బిరుదు ఉంది.గతంలో జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా కూడా పనిచేశారు.వాంఖడే స్టేడియంలో ఇప్పటికే ఆయన పేరు మీద ఒక స్టాండ్ కూడా ఉంది.వాంఖడే స్టేడియంలో ఇప్పటికే సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలతో పాటు, MCA మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ విగ్రహం కూడా స్టేడియంలో ఉంది. ఈ సొగసైన మాజీ బ్యాట్స్‌మన్ 1976లో ఆక్లాండ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో టెస్ట్ అరంగేట్రం చేశాడు . 1992లో పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌తో తన చివరి టెస్ట్ ఆడాడు. అతను 260 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 17868 పరుగులు చేశాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *