Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా మాధ్ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతిచెందారు. మరో కొంతమంది మావోయిస్టులు గాయపడినట్లు సమాచారం. ఈ కాల్పులు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి.
Also Read: Deputy CM Pawan Kalyan: ఫలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృషి.. నేడు రాష్ట్రానికి కుంకీ ఏనుగులు
Chhattisgarh: భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు బుధవారం ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. ఈ ఆపరేషన్‌లో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ డీఆర్జీ బలగాలు పాల్గొన్నాయి. అభూజ్‌మడ్ అడవుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. మావోయిస్టులపై గత కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ ఘటనపై మరింత సమాచారం కోసం అధికారిక ప్రకటనలు వెలువడాల్సి ఉంది.