Mardaani-3

Mardaani-3: రాణీ ముఖర్జీతో యశ్ రాజ్ ఫిల్మ్స్ ‘మర్దానీ-3’!?

Mardaani-3: రాణీ ముఖర్జీతో యశ్ రాజ్ ఫిల్మ్స్ తీసన ‘మర్దానీ’తో పాటు దాని సీక్వెల్ కూడా చక్కటి విజయాలను సాధించాయి. 2014లో విడుదలైన తొలి భాగం, 2019లో రిలీజ్ అయిన సీక్వెల్ రెండూ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ కావటంతో ‘మర్దానీ2’ రిలీజ్ అయిన డిసెంబర్ 13న ‘మర్దానీ3’ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది యశ్ రాజ్ సంస్థ. ఈ ప్రాంఛైజ్ లో రాణి ముఖర్జీ పోలీస్ ఆఫీసర్ శివానీ శివాజీ రాయ్ పాత్రలో నటించింది. ఇక మూడో భాగం షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఆరంభం కానుంది. ‘మర్దానీ3’లో ముందు రెండు భాగాలను మించి యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని రాణీముఖర్జీ చెబుతున్నారు. ‘రైల్వేమేన్’ సీరీస్ ఫేమ్ ఆయుష్ గుప్తా ‘మర్దానీ3’ స్క్రిప్ట్ ను అందించారు. గతంలో ‘బ్యాండ్ బాజా భారత్, గూండే, సుల్తాన్, జబ్ తక్ హై జాన్, టైగర్3’ సినిమాకు అసిస్టెంట్ గా పని చేసిన అభిరాజ్ మినవాలా ‘మర్దాని3’కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న హృతిక్, ఎన్టీఆర్ ‘వార్2’ కి అయాన్ ముఖర్జీ వద్ద అభిరాజ్ అసోసియేట్ గా పని చేస్తున్నాడు. మరి తొలిసారి మెగాఫోన్ పట్టబోతున్న అభిరాజ్ కి ‘మర్దానీ3’ ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  MAD Square: మ్యాడ్ స్క్వేర్ మెప్పించిందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *